ఎట్టకేలకు యాంకర్ సాంబశివరావు అక్రమాలకు అడ్డుకట్ట వేసిన హెచ్‌పీసీఎల్

పొద్దుటే లేచి లేవగానే మీడియాలో నీతులు చెప్పే ఓ యాంకర్ దారి తప్పారు. ఫోర్జరీ సంతకాలతో స్థలాన్ని ఆక్రమించి దానిలో పెట్రోల్ బంక్ నడుపుతున్నారు. అసలు ల్యాండ్ ఓనర్స్‌ వచ్చి తమ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఎంతగా వేడుకున్న పట్టించుకోలేదు. చివరకు పాపం పండింది. ఎట్టకేలకు ఆయన అక్రమాలకు అడ్డుకట్ట పడింది. ఆయన మరెవరో కాదు.. టీవీ5 యాంకర్ సాంబశివ రావు. తాజాగా సాంబశివరావుపై హెచ్‌పీఎస్ఎల్ పంజా విసిరింది. తమను బురిడీ కొట్టించాలని చూసిన సాంబశివరావును చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే మాదాపూర్‌లో సాంబశివరావు నకిలీ ల్యాండ్ ధృవపత్రాలతో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ స్థలాన్ని హెచ్‌పీసీఎల్ అధికారులు సీజ్ చేశారు.

నిజానికి ఈ వ్యవహారంపై ఇటీవలే సదరు ల్యాండ్ ఓనర్ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సాంబశివరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సైతం పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై మొన్నీమధ్యే కేసు నమోదైన సంగతి తెలిసిందే. ల్యాండ్‌ ఓనర్‌ ఫిర్యాదు చేయడంతో మాదాపూర్‌ పోలీసులు సాంబశివుడిపై, ఆయన కుటుంబ సభ్యులపై ఛీటింగ్‌ కేసు నమోదు చేశారు. ల్యాండ్ ఓనర్‌కి కూడా తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో సాంబశివరావు బంక్ నడుపుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించింది. ఈ క్రమంలోనే ఆక్రమిత స్థలాన్ని ఖాళీ చేసి వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలంటూ చెప్పినా సాంబశివరావు వినలేదట. దీంతో ఆక్రమిత బంక్ స్థలాన్ని అధికారులు సీజ్ చేశారు.

Advertisement

శేరిలింగంపల్లి ప్రాంతంలో 600 చదరపు మీటర్ల స్థలంలో సాంబశివరావు ఒక పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. అదొక ఆక్రమిత స్థలం. పెట్రోల్ బంక్ కోసం ఈ ల్యాండ్ కూడా కలిసి సాంబశివరావు కుటుంబ సభ్యులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌తో లీజ్‌కు ఇచ్చినట్టుగా ఒప్పందం చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అదేంటని సాంబశివరావును ప్రశ్నించగా.. పెట్రోల్ బంక్‌ను తమ పేరు మీదకే బదిలీ చేస్తామని చెప్పారట. నమ్మేసి ఊరుకున్నారట. అయితే ఎంతకూ తమ పేరు మీదకు బదిలీ చేయకపోవడంతో బాధితులు హెచ్‌పీసీఎల్ అధికారులను కలిశారు. తమ ప్రమేయం లేకుండానే తాము హెచ్‌పీఎస్‌ఎల్‌కు స్థలం లీజుకు ఇచ్చినట్టుగా ఫోర్జరీ సంతకాలు సృష్టించారని తెలిపారు. దీంతో కంపెనీ ప్రతినిధులు రంగంలోకి దిగి పెట్రోల్ బంక్ స్థలాన్ని సీజ్ చేశారు.