అంగళ్లు కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్.. అసలేంటీ ప్రోగ్రాం..? స్కాం ఎలా జరిగింది?

సాగునీటి ప్రాజెక్టుల సందర్శన నేపథ్యంలో అంగళ్లు కూడలిలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి తనపై పెట్టిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన పిటిషన్‌పై నేడు సానుకూలంగా తీర్పు వెలువడింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది. లక్ష రూపాయలు పూచికత్తు కింద చెల్లించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుకు అంగళ్లు కేసులో బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

కాగా.. అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యం నిన్ననే ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే ఇరుపక్షాల వాదనను విన్న హైకోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. నేడు టీడీపీ అధినేతకు సానుకూలంగా తీర్పు వెలువడింది. కాగా.. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు ర్యాలీలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. టీడీపీ అధినేత సమక్షంలోనే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతలపై దాడికి తెగబడ్డారు.

అనంతరం బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలపై కేసు నమోదైంది. కాగా.. కేసులో ఇతర నిందితులకు ఇప్పటికే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. మొత్తానికి నేడు ఏపీ హైకోర్టు చంద్రబాబుకు కూడా అంగళ్లు కేసులో బెయిల్ మంజూరు చేసింది.

Google News