అసెంబ్లీలో టీడీపీ దందా.. మీసం తిప్పిన బాలయ్య !!

అసెంబ్లీలో టీడీపీ దందా.. మీసం తిప్పిన బాలయ్య !!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఇక ఎలాగైనా సానుభూతిని గెయిన్ చేసుకోవాలి. ఇదే లక్ష్యంగా టీడీపీ ముందుకు సాగుతోంది. వాస్తవానికి చంద్రబాబు అరెస్టును ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటికైనా చంద్రబాబు అరెస్ట్ అయ్యారని లైట్ తీసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత కొనసాగిన ధర్నాలన్నీ జనాలకు డబ్బులిచ్చి చేయించారన్న విషయం కూడా బయటకు వచ్చింది. చివరకు చిన్నారులను సైతం వదలకుండా ధర్నాలకు టీడీపీ నేతలు వాడుకున్నారు. దీక్షలు చేయించారు. అయినా మైలేజ్ రాలేదు. ఇక చివరి అస్త్రంగా అసెంబ్లీని ఎంచుకున్నారు.

తొడగొట్టి.. మీసం తిప్పి హంగామా..

అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ప్రకటన రాగానే నందమూరి బాలకృష్ణ, యనమల రామకృష్ణుడు వంటి వారు జైల్లో చంద్రబాబుతో ములాఖాత్‌కు వెళ్లారు. వారికి సభలో ఎలా గలాటా చేయాలన్నది బాబే డైరెక్షన్ ఇచ్చారని టాక్. మొన్న లోకేష్ సైతం ఢిల్లీ నుంచి తమ శాసన సభ్యులతో వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన ప్రభుత్వాన్ని ఎలా రెచ్చగొట్టాలి? ఏమేం చేస్తే మంచి ప్రచారం వస్తుంది? అన్నది ప్లాన్ చేశారని సమాచారం. ఈ ప్రకారమే బాలయ్య బాబు అసెంబ్లీలో తొడగొట్టి.. మీసం తిప్పి హంగామా చేశారు. ఆయనకు కనీసం సామాజిక అంశాల మీద పట్టులేదు. మాట్లాడే నేర్పు లేదు. ఈ నేపథ్యంలో ఆయనకు తెలిసిన విద్య.. సులువుగా వచ్చే విద్య ఒక్కటే.. మీసం తిప్పడం.. తొడగొట్టడం.. ఇదంతా కలిసి తమ అనుకూల మీడియాలో విస్తృత ప్రచారం చేసుకోవచ్చు అనేది వారి ప్లాన్‌గా తెలుస్తోంది.

అసెంబ్లీలో టీడీపీ దందా.. మీసం తిప్పిన బాలయ్య !!

ఏకంగా పోడియం మీదకు ఎక్కి..

వందల కోట్ల నిధులను మింగేసి చట్టానికి దొరికిన తమ నాయకుడి విషయంలో సానుభూతి పోగేసేందుకు టీడీపీ పడరాని పాట్లు పడుతోంది. చంద్రబాబు మీద పెట్టిన కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు సభా నిబంధనలకు విరుద్ధం . అయినా సరే అధినేత ప్రాపకం కోసం తప్పని ప్రయత్నం చేస్తోంది. అలాగే మొన్ననే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృతమైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏకంగా పోడియం మీదకు ఎక్కి పేపర్లు లాగేసి.. మానిటర్ సైతం లాక్కునేందుకు యత్నించడం ఇక్కడ గమనార్హం. మొత్తానికి చంద్రబాబు అరెస్ట్ నుంచి సాధ్యమైనంత లబ్ధి పొందేందుకు టీడీపీ ఆపసోపాలు పడుతోందనడంలో సందేహం లేదు.

Google News