సీనియర్లకు ఇవే చివరి ఎన్నికలా.. ఇక మీదట వారసురాళ్లదే రాజ్యం..!

సీనియర్లకు ఇవే చివరి ఎన్నికలా.. ఇక మీదట వారసురాళ్లదే రాజ్యం..!

తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందనే టాక్ కూడా నడుస్తోంది. గత ఎన్నికలు 7, డిసెంబర్ 2018న జరిగాయి. తొలి శాసనసభ 2019.. జనవరిలో కొలువుదీరింది కాబట్టి ఈ ఏడాది కూడా ఆ సమయానికి కొలువుదీరాలి.

ఈ క్రమంలోనే అక్టోబర్ 6న షెడ్యూల్ ఇక అక్కడి నుంచి సినిమా స్టార్ట్.. నామినేషన్ల స్వీకరణ.. పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ వంటివి జనవరి తొలి వారం లేదంటే మలి వారం నాటికి పూర్తి కావాల్సిందే కాబట్టి వచ్చే నెల నుంచి తెలంగాణలో ఎన్నికల పండగ షురూ. పార్టీలన్నీ కూడా దీనికి అనుగుణంగానే సిద్ధమవుతున్నాయి.

ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సారి తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ఒకట్రాన్స్‌‌జెండర్‌ ఎంపికయ్యారు. సాధారణంగా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, ఓటు హక్కువంటి వాటిపై అవగాహన కల్పించేందుకు గానూ.. ఎన్నికల కమిషన్ సెలబ్రిటీలను ఎంపిక చేస్తుంది. ఈ సారి మాత్రం సెలబ్రెటీలను పక్కనపెట్టేసి తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్‌ను ఎంపిక చేసింది. వరంగల్‌లోని కరీమాబాద్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్‌ లైలా ఎంపికయ్యారు.

ఇక ఎన్నికల ప్రచార బరిలోకి కొన్ని పార్టీల అభ్యర్థులు ఆల్రెడీ దిగారు. అధికార బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి నాలుగు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. మొత్తానికి తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండని వదిలేసింది. కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో బిజీబిజీగా ఉన్నాయి.

ఈసారి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ కూడా ఉంది. ఇక ఏ పార్టీలోనైనా సీనియర్ లీడర్లకు ఇవే లాస్ట్ ఎన్నికలవుతాయని టాక్ ఉంది. వచ్చే ఎన్నికల సమయానికి మహిళ రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్స్ ఎక్కువ. వచ్చే ఎన్నికల నాటికి వారికి ఆరోగ్యం సహకరించకుంటే వారి స్థానంలో మహిళ అభ్యర్థులు వచ్చేస్తారు. ఇప్పటి వరకూ వీరి కుమారులు చక్రం తిప్పుతున్నారు. ఈసారి వారికి కుమార్తెలు ఉంటే వారే రంగంలోకి దిగనున్నారు.

మహిళ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఇక మీదట నేతలంతా తమ కుటుంబంలోని మహిళలను అధికారంలోకి తీసుకురానున్నారు. ఇప్పటి వరకూ కేసీఆర్ ప్రభుత్వంలో పెద్దగా మహిళలు లేరు. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. నెక్ట్స్ ఎన్నికల్లో మాత్రం తప్పనిసరిగా మహిళలను రంగంలోకి దించాల్సిందే.

Google News