తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం..

తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కారు స్పీడుకు పూర్తిగా బ్రేకులు పడ్డాయ్. కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించి అధికార పీఠాన్ని దక్కించుకుంది. నిజానికి తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఎన్నికలోనూ అప్రతిహతంగా దూసుకుపోతోంది. అలాంటిది ఈ ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయం పాలైంది.

ఈసారి కూడా పక్కాగా బీఆర్‌ఎస్‌దే విజయమని.. తాను హ్యాట్రిక్ సీఎం అవుతానని కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. కేటీఆర్ సైతం నిన్నటి నుంచి ట్విటర్ వేదికగా.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజం కావని చెబుతూ వస్తున్నారు. కానీ గులాబీ పార్టీకి ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. సీఎం కేసీఆర్ పోటీ చేసిన రెండు స్థానాలు గజ్వేల్, కామారెడ్డిలలో ఒకచోట ఓటమి పాలవడం గమనార్హం.

కాగా.. కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. గవర్నర్ కూడా కేసీఆర్‌ రాజీనామాను ఆమోదించారు కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ కేసీఆర్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. కాగా పలువురు మంత్రులు సైతం ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వారిలో ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌, కొప్పుల ఈశ్వర్‌, నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ ఉన్నారు.

Google News