సత్తారుకి, మాకు సంబంధం లేదు… క్లారిటీగా తేల్చిన వైకాపా

సత్తారుకి, మాకు సంబంధం లేదు… క్లారిటీగా తేల్చిన వైకాపా

ప్రపంచంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా దానిని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మెడకు చుట్టే యత్నం చేస్తోంది టీడీపీ. ఎక్కడో అమెరికాలో ఏదో జరిగితే దానిని తీసుకొచ్చి వైసీపీకి అంటగడుతోంది. గురువింద గింజ సామెతలో ఇపుడు పచ్చపార్టీ నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని… అసలు తప్పు ఎవరు చేసినా తప్పే. దానిని ఒప్పు అని ఎవరూ వెనుకేసుకు రావడం లేదుగా దీనికెందుకు అంత రాద్దాంతం అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు

అసలేం జరిగిందంటే..

అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ సత్తారు వెంకటేష్ రెడ్డి అనే అతను దొరికిపోయాడు. అతను వైసీపీ నేతేనని నానా రాద్దాంతం చేస్తోంది. ఈ ఘటనను ఖండిస్తూ వైసీపీ వెంటనే ఓ ప్రకటన కూడా చేసింది. కానీ దానిని పట్టించుకోకుండా వైసీపీపై బురద జల్లే యత్నం చేస్తోంది. ‘‘అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్‌ఆర్‌ఐ సత్తారు వెంకటేష్ రెడ్డికి, పార్టీ కి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఘటనను వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ కేసులో ఉన్న సత్తారు వెంకటేష్ రెడ్డి చేసిన నేరం అతని వ్యక్తిగతం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అని వైసీపీ ట్విటర్ వేదికగా తెలిపింది.

సత్తారుకి, మాకు సంబంధం లేదు… క్లారిటీగా తేల్చిన వైకాపా

గతంలో అమెరికాలో టీడీపీ తరుఫున ఉన్న వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడటం జరిగింది. మోదుగుముడి’ కిషన్ చౌదరి, చెన్నుపాటి’ (‘మోదుగుముడి’) చంద్రకళ పూర్ణిమ. యార్లగడ్డ రామ్ చౌదరి, సెక్స్ వర్కర్‌తో కలిసి హోటల్‌లో అడ్డంగా బుక్కయిన వినిత్ రావూరి, వీళ్ళంతా పచ్చదండు కాదా..? మరి వీళ్ల గురించి ఎందుకు మాట్లాడరు? ఉమెన్ ట్రాఫికింగ్, సినీతారాలతో సెక్స్ రాకెట్ వంటి వ్యవహారాల్లో ఆరితేరిన ఘనులు తెలుగు తమ్ముళ్ళే అన్న సంగతి మర్చిపోయారా? అని వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

సత్తారుకి, మాకు సంబంధం లేదు… క్లారిటీగా తేల్చిన వైకాపా

అప్పట్లో వారిపై ఆరోపణలు వచ్చినపుడు టీడీపీ నేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు గానీ కనీసం ఖండించలేదు సరికదా.. వారిపై చర్యలు తీసుకున్న పాపాన కూడా పోలేదు. అటువంటి గురువింద గింజలు ఇప్పుడు నీతులు వల్లిస్తున్నాయి. ఎవరో చేసిన తప్పును వైసీపీ నెత్తికి రుద్దేందుకు యత్నిస్తున్నాయంటూ విమర్శిస్తున్నారు.