టీడీపీ, జనసేనలతో డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేస్తున్న బీజేపీ.. ఈ ఘటనే నిదర్శనం..

టీడీపీ, జనసేనలతో డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేస్తున్న బీజేపీ.. ఈ ఘటనే నిదర్శనం..

ఇవాళ ఎన్డీఏ కూటమి పేరిట ఏపీలో మేనిఫెస్టో విడుదలైంది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల అగ్రనేతలు కలిసి ఈ మేనిఫెస్టోను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో చంద్రబాబు సహా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అంతా బాగానే ఉంది కానీ ఆ కార్యక్రమాన్ని చూసిన ప్రజలకు మాత్రం చిన్న సందేహం వచ్చింది. దీనిని టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి మేనిఫెస్టో అనాలా? లేదంటే టీడీపీ – జనసేన మేనిఫెస్టో అనాలా? అని..

ఎందుకంటే ఈ మేనిఫెస్టో కార్యక్రమంలో బీజేపీ తరుఫున రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారనే కానీ మేనిఫెస్టోను ఆవిష్కరించే సమయంలో ఆయన కనీసం మేనిఫెస్టో కాపీని చేతిలో తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. తనకు వద్దంటూ నిరాకరించారు. కనీసం చంద్రబాబు పక్కకు కూడా ఆయన రాలేదు. కాస్త డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేశారు. ఇదంతా చూస్తుంటే అసలు బీజేపీ దీనికి మద్దతు ఇస్తున్నట్టా? ఇవ్వనట్టా? అనే సందేహం ఎవరికైనా వచ్చి తీరుతుంది. అసలే బీజేపీ మొదటి నుంచి కూటమికి దూరంగానే ఉంది.

ఎన్నో సార్లు చంద్రబాబు, పవన్ ఢిల్లీకి వెళ్లిన మీదట కానీ బీజేపీ కూటమికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆ తరువాత కూడా బీజేపీ ఈ రెండు పార్టీలతో అంటీముట్టనట్టుగానే ఉంది. ఏపీ డీజీపీ, సీఎస్‌ను ట్రాన్స్‌ఫర్ చేయాలని టీడీపీ, జనసేన అధినేతలు మొత్తుకుంటున్నా కూడా బీజేపీ పట్టనట్టే వ్యవహరిస్తోంది. ఇదంతా చూస్తుంటే గుర్రాన్ని నీటి వరకూ లాక్కురావొచ్చు కానీ నీళ్లు తాగించలేమనే విషయం గుర్తొస్తోంది. వీళ్లు పట్టుబట్టి బీజేపీని కూటమిలోకి లాక్కొచ్చారు కానీ బీజేపీ మాత్రం అయిష్టంగానే ఉంది. ఈ రెండు పార్టీలతో వీలైనంత డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేస్తోందనడానికి నేటి ఘటనే నిదర్శనం.