BRS మేనిఫెస్టోను విడుదల చేసిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు BRS మేనిఫెస్టో విడుదల చేశారు. గత ఎన్నికల మాదిరి కాకుండా ఈ సారి 45 రోజుల ముందే మేనిఫెస్టోను వదిలారు. తామిచ్చిన మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ అధికారంలోకి వచ్చిను ఆరేడు నెలల్లోనే అమలు చేస్తామన్నారు.
కేసీఆర్ మేనిఫెస్టోలోని కీలక అంశాలు..
రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబాలన్నింటికీ రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా
రూ.5లక్షల బీమాను ఎల్‌ఐసీ సంస్థ ద్వారా చెల్లింపు
రాష్ట్రంలో 93లక్షల కుటుంబాలకు ‘కేసీఆర్ బీమా-ఇంటింటికీ ధీమా’ పథకంతో లబ్ది
రైతుబంధు, దళితబంధును కొనసాగిస్తాం. రైతుబంధును రూ.16 వేలు చేస్తాం. తొలి ఏడాది 12 వేలు ఇస్తాం.
ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ.5016 పెంపు.అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016కి పెంపు. ఏడాదికి రూ.500 చొప్పున దశలవారీగా పెంపు.
సౌభాగ్యలక్ష్మి పథకం పేరిట అర్హులైన మహిళలకు నెలకు రూ.3000 భృతి.
తెల్ల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ.
దివ్యాంగుల పెన్షన్లు రూ.4016 నుంచి రూ.6 వేలకు పెంచుతాం. ప్రతి ఏటా రూ.300 చొప్పున పెంచుతాం.
కేసీఆర్ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది.
అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400లకే గ్యాస్ సిలిండర్.
గిరిజనులకు పోడు పట్టాల కార్యక్రమం కొనసాగుతుంది.
గిరిజనులకు మరిన్ని సంక్షేమ పథకాలు తెస్తాం.
తండాలు, గోండుగూడెలను పంచాయతీలుగా చేస్తాం.