YSRCP UK Meet: జగనన్నకు అండగా నిలుద్దాం

YSRCP UK Meet: జగనన్నకు అండగా నిలుద్దాం

దేశ విదేశాల్లోనూ వైసీపీకి కేడర్ ఉంది. తాజాగా యూకేలో వైసీపీ సోషల్ మీడియా సమావేశం పెద్ద ఎత్తున జరిగింది. యూకే వైయస్ఆర్ సీపీ కన్వీనర్ డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి, వైసీపీ నాయకుడు ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో లండన్‌లో పెద్ద ఎత్తున జరిగింది.

YSRCP UK Meet: జగనన్నకు అండగా నిలుద్దాం

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైసీపీ రాష్ట్ర మీడియా. సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు మేడపాటి వెంకట్, ఏపీఎస్ఎస్‌డీసీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి, వైసీపీ అమెరికా కన్వీనర్ పండుగాయల రత్నాకర్ పాల్గొన్నారు.

Ysrcp Uk Meet 2

యూకే నలుమూలల నుంచి 450 మందికి పైగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Ysrcp Uk Meet 4

ఈ సందర్భంగా సజ్జల భార్గవరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రతి క్షణం జగనన్న కష్టపడుతున్నారన్నారు. ప్రజా సంక్షేమమే కాదు.. అవినీతిపరుల గుండెల్లో సింహ స్వప్నంగా జగనన్న నిలిచారన్నారు. దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడే జగనన్నకు మనమందరం అండగా నిలవాలన్నారు.

YSRCP UK Meet: జగనన్నకు అండగా నిలుద్దాం

ఏపీలో గ్రామాలను సీఎం జగనన్న ఎంత అభివృద్ధి చేశారో మీరందరూ భారత దేశం వచ్చినప్పుడు చూస్తే ఆశ్చర్య పోతారని సజ్జల భార్గవరెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో సోషల్ మీడియాలో ఎలా పని చేయాలో, 175/175 టార్గెట్‌గా అందరం కలిసి చేద్దామని, మీకు ఏ కష్టం వచ్చినా తాను ఉంటానని సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి భార్గవరెడ్డి తెలిపారు.

Google News