ప్రశాంత్ కిషోర్‌తో చంద్రబాబు డీల్..!

ప్రశాంత్ కిషోర్‌తో చంద్రబాబు డీల్..!

గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసుకున్న డీల్‌తో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయ్యారు. తను స్థాపించిన ఐ ప్యాక్ ద్వారా ఏపీలో ఒక మిరాకిల్ చేశారు. వైసీపీ కూడా ఊహించనన్ని సీట్లను ఐ ప్యాక్ టీం తెచ్చిపెట్టింది. అయితే ఆ వ్యూహాలేవీ ఇప్పుడు సెట్ కావడం లేదు. ఐ ప్యాక్ టీం ఏం చేసినా కూడా పార్టీకి రివర్స్ అవుతోంది. తత్ఫలితంగా అటు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ.. ఇటు పంచాయతీ ఉప ఎన్నికలోనూ వైసీపీ ఘోర వైఫల్యం చెందింది.

ఈ క్రమంలోనే వైసీపీ ఇక మీదట ఐ ప్యాక్ సేవలను వాడుకోవద్దని భావిస్తోందట. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. చంద్రబాబుకు సహకరించేలా ప్రశాంత్ కిషోర్‌తో చర్చలు జరుపుతున్నారనేది ఓ ఆంగ్ల పత్రిక కథనం. అయితే ఆ చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయట. కోల్‌కతాలో చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్‌ల మధ్య భేటీ జరిగిందని దీనిని మమతా బెనర్జీయే అరేంజ్ చేశారని సదరు ఆంగ్ల పత్రిక కథనం. ఈ భేటీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఉన్నారట.

Advertisement

మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ ప్రస్తుతం టీఎంసీ ప్రధాన కార్యదర్శిగా, లోక్‌సభ ఎంపీగానూ ఉన్నారు. నారా లోకేష్‌కు, అభిషేక్ బెనర్జీకి మధ్య మంచి స్నేహం ఉందట. ఈ క్రమంలోనే అభిషేక్ బెనర్జీ సాయంతో టీడీపీ అగ్రనాయకత్వంతో పీకే భేటీ జరిగిందని ఆంగ్ల పత్రిక పేర్కొంది. 2021లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో టీఎంసీ ఘన విజయం సాధించిన తర్వాత పీకే బహిరంగంగా ఇక తాను వ్యూహకర్తగా ఉండబోనని ప్రకటించారు. ఆ తరువాత సొంత రాష్ట్రమైన బీహార్‌ల జన్ సూరజ్‌ను స్థాపించారు.

ఇక ఇప్పుడు ఏపీలో చంద్రబాబు ఒకవైపు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈక్రమంలోనే ప్రశాంత్ కిషో ర్ సాయంతో ఏపీ చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఇటీవలి కాలంలో పీకేతో జగన్ కూడా భేటీ అయ్యారట. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య చాలా సేపు చర్చలు జరిగాయట. మొత్తం మీద పీకే మాత్రం జగన్‌ను వదిలి చంద్రబాబుకి అయితే సాయం చేయరని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో చూడాలి.