బీసీలపై చంద్రబాబు, పవన్ వరాల జల్లు..

Chandra Babu Pawan Kalyan D

టీడీపీ-జనసేన ‘జయహో బీసీ’ సభ విజయవంతంగా ముగిసింది. ఈ సభలో బీసీలపై ఇరు పార్టీలు వరాల జల్లు కురిపించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. బీసీల అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలలను వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆది నుంచి టీడీపీ బీసీలకు అండగా ఉంటూ వస్తోందన్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించడానికి ముందుకు ఎందరో నేతల అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలిపారు.

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించడంతో16,800 మంది పదవులు కోల్పోయారని చంద్రబాబు తెలిపారు. టికెట్ దక్కని వారి విషయంలోనూ ఈ సందర్భంగా చంద్రబాబు భరోసా ఇచ్చారు. టికెట్ దక్కని వారికి నామినేటెడ్ పదవులు.. బీసీ కులగణను చట్టబద్దంగా చేపట్టడమే కాకుండా వారి ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేస్తామన్నారు. చంద్రన్న బీమా కింద బీసీలకు రూ.10 లక్షలు ఇస్తామని చంద్రబాబు తెలిపారు.

బీసీలపై చంద్రబాబు, పవన్ వరాల జల్లు..

బీసీ డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలు..

  • బీసీలకు 50 సంవత్సరాలకే పింఛను. పెన్షన్ మొత్తం రూ.3 వేల నుంచి రూ.4వేలకు పెంపు.
  • రూ.10 లక్షలతో చంద్రన్న బీమా పునరుద్ధరణ. పెళ్లి కానుక రూ.లక్షకు పెంపు
  • విద్యాపథకాలు అన్నీ పునరుద్ధరించడమే కాకుండా షరతుల్లేని విదేశీ విద్య అమలు.
  • చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్‌ కోసం తీర్మానం..
  • సంస్థలన్నింటికీ నామినేటెడ్‌ పదవుల్లో 34శాతం రిజర్వేషన్‌.
  • ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాల పునరుద్ధరణ
  • చట్టబద్ధంగా కులగణన.. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం.
  • జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు… దామాషా ప్రకారం నిధుల కేటాయింపు.
  • సామాజిక న్యాయపరిశీలన కమిటీ ఏర్పాటు.
  • బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం..
  • సబ్‌ప్లాన్‌ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు.
  • స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10వేల కోట్లు.
  • గురుకులాలను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌.
  • ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాల పునరుద్ధరణ
  • రూ.5వేల కోట్లతో ‘ఆదరణ’ పరికరాలిస్తాం.
  • పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పథకం పునరుద్ధరిస్తాం.
  • బీసీలకు ప్రత్యేక భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం
  • తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు కో-ఆప్షన్‌ సభ్యులుగా అవకాశం కల్పిస్తాం.
  • నియోజకవర్గ లేదా మండల కేంద్రాల్లో కామన్‌ వర్క్‌ షెడ్స్‌, ఫెసిలిటేషన్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేస్తాం.
Google News