విజన్ వైజాగ్ సదస్సులో రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

విజన్ వైజాగ్ సదస్సులో రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

విజన్ వైజాగ్ సదస్సులో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాతే విశాఖే రాజధాని అని స్పష్టం చేశారు. నేడు వైజాగ్‌ విజన్‌-ఫ్యూచర్‌ విశాఖ’ పేరిట విశాఖలో జగన్ సదస్సు నిర్వహిస్తున్నారు. నేడు, రేపు ఈ సదస్సు జరగనుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఇక్కడే జగన్ ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత తాను విశాఖకు పూర్తిగా షిఫ్ట్ అవుతానని… ఇకపై విశాఖే రాజధాని అని తేల్చి చెప్పారు.

విశాఖ నగరంలో అన్ని సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖ స్టేడియంను మెరుగ్గా నిర్మించామన్నారు. కొత్తగా భోగాపురం ఎయిర్‌పోర్టును విశాఖ నగరం కనెక్టివిటీని పెంచామన్నారు. ఇలాంటి విశాఖలో తాను వచ్చే ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత నుంచి విశాఖను ఏపీ రాజధానిగా అవుతుందని.. పాలన మొత్తం ఇక్కడి నుంచే జరుగుతుందన్నారు. ప్రపంచం మొత్తం విశాఖను.. దాని నిర్మాణాలను చూసేలా తీర్చిదిద్దుతామన్నారు.

విశాఖ ఆర్థిక గ్రోత్‌ను పెంచే విధంగా కృషి చేస్తామని జగన్ వెల్లడించారు. ఎన్నికల తర్వాత హైదరాబాద్ కన్నా విశాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఆంధ్రలో తలసరి ఆదాయం పెరిగిందని.. వ్యవసాయంలో ఆంధ్ర అగ్రస్థానంలో ఉన్నారు. పోర్టుల అభివృద్ధి సైతం ఐదేళ్లలో జరిగిందన్నారు.  ఇక అమరావతికి తానేమీ వ్యతిరేకం కాదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. అమరావతి కి మేము వ్యతిరేకం కాదని.. ఇక మీదట శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందన్నారు. 

Google News