వామ్మో.. చంద్రబాబు, రామోజీ ఊసరవెల్లిని మించిపోయారుగా..!

వామ్మో.. చంద్రబాబు, రామోజీ ఊసరవెల్లిని మించిపోయారుగా..!

ఒక విషయాన్ని అవసరానికి అనుకూలంగా మార్చుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు దిట్ట. ఇక ఆయనకు వత్తాసు పలకడంలో ఎప్పుడూ పచ్చ మీడియా ముందుంటుంది. చంద్రబాబుకు గురువైనా రామోజీరావు అయితే మసిపూసి మారేడుకాయ చేయడంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. ఒకే విషయాన్ని తమకు అనుకూలమైతే ఒకలా.. ప్రతికూలమనిపిస్తే మరోలా ప్రచారం చేస్తూ ఉంటారు. అసలు నిజాలను దాచేసి విష ప్రచారం చేయడంలో రామోజీ దిట్ట. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా?

అప్పట్లో ఒకసారి ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి రామోజీరావు ఈనాడులో ఒక ప్రోగ్రాం వచ్చింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే రాష్ట్రంలో ప్రజలకు భూ సమస్యలు ఉండవు.. రైతులకు మేలు జరుగుతుంది అని అప్పట్లో ప్రోగ్రాం నడిపారు. అయితే ఆ విషయం మరిచారో లేదంటే.. చంద్రబాబుకు ఎలాగైనా సపోర్ట్ చేయాలన్న తపనో కానీ ఇప్పుడు దోశ తిరగేసినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాటను తిరగేశారు. పచ్చ మీడియా అంతా ఏకమై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టాయి. దీనిలో ఈనాడు ముందు వరుసలో ఉంది.  

ఇదంతా చూస్తుంటే జనాలకు అర్థం కాదా? నాడు అలా.. నేడు ఇలా ఏంటని? ఊసరవెల్లుల మాదిరిగా రంగులు మారుస్తారని.. వీరి నోటికి ఎటైనా పదునేనని.. ఎన్నికల సందర్భంగా ప్రజలను భయాందోళనకు గురి చేయడానికి టీడీపీ, పచ్చ మీడియా ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌ను అస్త్రంగా వాడుతున్నాయి. రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన ప్రజలను తప్పు దోవ పట్టించడం చాలా బాధాకరం. నాడు ఈ యాక్ట్‌ను ప్రశంసించిన ఈనాడు.. నేడు చంద్రబాబుకు వత్తాసు పలకడం దౌర్భాగ్యం. కానీ ప్రజలు చాలా అప్రమతమై వీళ్ళ విష ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు.