పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ జగన్‌కే గుద్ది పడేస్తున్న ఉద్యోగులు

పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ జగన్‌కే గుద్ది పడేస్తున్న ఉద్యోగులు

పోస్టల్ బ్యాలెట్ మొత్తం ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉద్యోగులు గుద్ది పడేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలకు సంబంధించి పోస్టర్ బ్యాలెట్ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. కాగా అధికశాతం ఓట్లు జగన్ మోహన్ రెడ్డి సారథ్యం వహిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ వైపు పొలవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో ఉద్యోగులను చిన్నచూపు చూడటం..వాళ్లకు జీతాలేందుకు అని అవహేళన చేయడం వంటివన్నీ ఉద్యోగుల మైండ్‌లో బలంగా నాటుకు పోయాయి.

అలాగే వైయస్ జగన్ అమలు చేస్తున్న గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్( జీపీఎస్) వంటి పథకాలన్నీ తమకు చాలా ఉపయోగపడతాయని ఉద్యోగులు భావిస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఉద్యోగులకు వ్యతిరేకమే అన్నది అందరికీ తెలిసిందే. మళ్లీ చంద్రబాబును తీసుకొచ్చి నెత్తిన కూర్చోబెట్టుకోవడానికి వారు సిద్ధంగా లేరు. మళ్ళీ అధికారంలోకి వస్తే తమకు మరింత నష్టం అని ఉద్యోగులు భయపడుతున్నారు. పైగా చంద్రబాబును ఏమాత్రం నమ్మే పరిస్థితి ఉద్యోగుల్లో లేదు. పైగా పాలిచ్చే గేదెను కాదనుకుని.. దున్నపోతును ఎవరు కోరుకుంటారు? ఏపీ ప్రజలు కూడా ఇప్పుడు చేస్తున్నది అదే.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ జగన్‌కే గుద్ది పడేస్తున్న ఉద్యోగులు

ఇది చాలదన్నట్టుగా చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటే ఎక్కడలేని డబ్బు సరిపోదు. మరి అంత డబ్బు ఏపీలో ఉందా? రాష్ట్ర బడ్జెట్ మొత్తం కుమ్మరించినా కూడా చంద్రబాబు చెబుతున్న పథకాలకు ఒక మూలకు కూడా రాదు. అలాంటపుడు చంద్రబాబు గెలిస్తే నిధులన్నీ ఆ పథకాలకు మళ్లించి తమకు అసలు జీతాలు కూడా రావని ఉద్యోగులు భయపడుతున్నారు. దీంతో ఉద్యోగులంతా జగన్ మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఉద్యోగులంతా మూకుమ్మడిగా ఫ్యాన్ గుర్తుకు గుద్ది పడేస్తున్నట్టు సమాచారం.

Google News