నాడు ఒప్పయింది నేడు తప్పయిందా ? నాలుక మడతేసిన టీడీపీ, ఎల్లో మీడియా

నాడు ఒప్పయింది నేడు తప్పయిందా ? నాలుక మడతేసిన టీడీపీ, ఎల్లో మీడియా

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో టీడీపీ.. దాని అనుబంధ ఎల్లో మీడియా పాపం పిల్లిమొగ్గలు వేస్తోంది. ఎక్కడ ఈ యాక్ట్‌తో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు మంచి పేరు వస్తుందో.. ఎక్కడ ఓట్లన్నీ ఆ పార్టీ తన్నుకు పోతుందోనని ఆందోళన చెందుతున్న పచ్చ పార్టీ, పచ్చ మీడియా కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాయి. ఎలాగైనా ప్రజలను మెప్పించాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు. అయితే ఆసక్తికరంగా కొద్ది రోజుల క్రితం ఈ చట్టాన్ని ఆహా.. ఓహో అంటూ ప్రశంసించిన వారే ఇప్పుడు ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ చట్టం కానీ అమల్లో ఉంటే.. మీ భూములు.. స్థలాలు కాపాడుకునేందుకు యాతనపడక్కర్లేదు అంటూ అప్పుడు చెప్పినవాళ్ళే ఇప్పుడు అమ్మో అది చట్టం కాదు… భూతం అంటూ కొత్త రాగాలు అందుకుంటున్నారు.

ఇలాంటి చట్టం ఏపీలోనూ రావాలి..

ఇక పచ్చ మీడియా అయితే మరింత దిగజారి ప్రవర్తిస్తోంది. చంద్రబాబుకు పనికొస్తుంది ఆంటే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేద్దాం అనే స్థాయికి దిగజారిపోయారు. చంద్రబాబు కోసం ఐతే రామాయణం.. ఇతిహాసాలు… బైబిల్ ఖురాన్ సైతం చదవొద్దు అని చెప్పడానికి వాళ్ళు ఏమాత్రం వెనుకాడరు..గతంలో టీడీపీ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఈ చట్టాన్ని ఆకాశానికి ఎత్తారు. ఈ చట్టం మంచిదని.. పలు దేశాల్లో సైతం ఈ చట్టం కారణంగానే భూ తగాదాలు లేవని తెలిపారు. పైగా ఇలాంటి చట్టం ఆంధ్రాలో కూడా రావాలని పయ్యావుల కేశవ్ నాడు అసెంబ్లీలో డిమాండ్ చేస్తే.. ఆయన వాగ్దాటి, విషయపరిజ్ఞానం చూసి టీడీపీ సభ్యులు బల్లలు చరిచారు.ల్యాండ్ టైట్లింగ్ చట్టం సూపర్ అని అలాంటి మహోన్నత చట్టం దేశంలో గతంలో రానే లేదని పయ్యావుల కేశవ్ తెలిపారు.

నాడు ఆకాశానికి ఎత్తి.. నేడు చర్చలా?

అలాంటి చట్టాలుంటే ప్రజలకు నిశ్చింత.. భూములకు భద్రత అని కూడా ప్రాసతో కూడిన ప్రసంగాలు చేశారు. అప్పట్లో ఈనాడు వారి ఈటీవీలో సైతం ఆ చట్టం గొప్పతనంపై కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఆ చట్టం పేరిట ప్రజలను భయపెట్టడంలో రామోజీ ముందున్నారు. నాడు చట్టాన్ని ఆకాశానికి ఎత్తి.. నేడు అదే చట్టాన్ని భూతంగా చూపిస్తూ గంటల కొద్దీ చర్చలు నిర్వహిస్తున్నారు. ఆంటే చంద్రబాబుకు ఉపయుక్తం ఆంటే తన వైఖరి ఎలాగైనా మార్చుకునేందుకు రామోజీరావుకు ఎలాంటి సిగ్గు ఉండదు. ఇక మీడియా చాలదన్నట్టుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రసంగించారు. ఇప్పుడు తన బంధువు చంద్రబాబు కోసం ఆమె సైలెంట్ అయ్యారు. ఈ చట్టం గొప్పతనం గురించి చంద్రబాబు, రామోజీ, పురందేశ్వరిలకుక బాగా తెలుసు. కానీ ముగ్గురూ నాలుక మడతేశారు.

Google News