అధికారం పోయినా పొగరు తగ్గని చింతమనేని.. ఎంతకు తెగించాడంటే..

అధికారం పోయినా పొగరు తగ్గని చింతమనేని.. ఎంతకు తెగించాడంటే..

చింత చచ్చినా పులుపు చావలేదని.. కొందరి పనులు అలాగే అనిపిస్తూ ఉంటాయి. ఓ నేతకు ఎమ్మెల్యే పదవి పోయింది. గత ఎన్నికల్లో జనం ఛీకొట్టి మూలన నిలబెట్టారు. దీనికి తోడు పాతకేసులు.. అరెస్ట్ అయి స్టేషన్‌లో ఉండొచ్చినా తీరు మారలేదు. ఆయన ఎవరో అర్థమైందా? దెందులూరు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్. తనకన్నా తక్కువ స్థాయి వాళ్లు మనుషుల మాదిరిగా కూడా కనబడరు ఆయనకు. అవమానిస్తూనే ఉంటారు. ‘ఒరేయ్ మీ ఎస్సీ లకు ఎన్నికలు.. రాజకీయాలు ఎందుకురా… మేము రాజకీయాలు చేస్తాం .. మీరు జస్ట్ ఓట్లు వేయండి’ చాలు అని బహిరంగ సభలో అహంకార పూరితంగా మాట్లాడిన చింతమనేని ప్రభాకర్ ఇప్పటికీ ఇంకా అదే బలుపుతో ఉన్నారు.

అధికారం పోయినా పొగరు తగ్గని చింతమనేని.. ఎంతకు తెగించాడంటే..

నిబంధనలకు విరుద్ధంగా అటవీ భూముల్లో రోడ్లు వేస్తున్నారు. దీనిని అడ్డుకున్నారని అటవీ సిబ్బందిని కొట్టడంతోబాటు ఇసుక దందాను ఆపినందుకు ఎమ్మార్వోను సైతం చింతమనేని కొట్టారు. ఇంకా అదే పొగరు.. బలుపు చూపుతూ అందర్నీ భయపెడుతున్నారు. తాజాగా పెదవేగి మండలం, రామచంద్రాపురం అడ్డరోడ్డు దగ్గర వీరంకి లక్ష్మీనారాయణ అనే గొర్రెల కాపరిపై చింతమనేని దాడి చేశారు. తన జీడి మొక్కల దగ్గరకి గొర్రెలు వెళ్లాయంటూ, అటుగా వెళుతున్న చింతమనేని కారు దిగి, లక్ష్మీనారాయణను తిడుతూ ఆయన్ను కింద పడేసి గుండెల మీద తన్నడమే కాకుండా అతని గొర్రెలను దౌర్జన్యంగా తన కార్లో ఎక్కించుకొని తీసుకుపోయారు. దీంతో బాధితుడు లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అధికారం పోయినా పొగరు తగ్గని చింతమనేని.. ఎంతకు తెగించాడంటే..

అంతేకాదు.. ఎవడొస్తాడో చూస్తానని, ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ చింతమనేని బెదిరింపులకు పాల్పడ్డారని.. ఈ ఘటనకు అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలే సాక్ష్యమని బాధితుడు వెల్లడించాడు. విషయం తెలిసిన వెంటనే, దెందులూరు నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షుడు మట్టా శంకర్ ఆధ్వర్యంలో ప్రజలు రామచంద్రాపురం అడ్డరోడ్డుకు చేరుకొని చింతమనేని కారును అడ్డగించి నిలదీయగా, తాను కొట్టలేదని చెబుతూ, మెల్లగా జారుకోవడం గమనార్హం. మొత్తానికి చింతమనేనికి ఇంకా బలుపు తగ్గలేదని, ఈ ఎన్నికల్లో కూడా ఓడిస్తే తప్ప పొగరు దిగదని ప్రజలు అంటున్నారు.