ఏపీ దూసుకుపోతోంది.. ఏపీలో జీఎస్టీ వసూళ్లు అదుర్స్
చాలా కాలంగా ప్రతిపక్షాలకు ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు రావడం లేదు. వచ్చిన కాకిలా ఎగిరిపోతున్నాయంటూ తెగ ప్రచారం చేస్తున్నాయి . కానీ ఏపీలో ప్రస్తుత పరిస్థితులు చూసి నివ్వెరబోతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక రంగాలు తారాజువ్వల్లా ఆకాశానికి ఎగురుతుంటే ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టుకుని మరీ చూస్తున్నాయి. జీఎస్టీ వసూళ్లలో ఏపీ దూసుకెళుతోంది. ఇదేదో ఏపీ ప్రభుత్వం చెప్పుకుంటున్నది కాదు.. సాక్షాత్తూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంశాన్ని వెల్లడించారు
నిర్మలా సీతారామన్ వెల్లడించిన అంశాలేంటంటే..
ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్ళలో 12 శాతం వృద్ధి నమోదైందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2023 ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య రూ .5,019 కోట్లు వసూలయ్యాయని పేర్కొన్నారు. వాహనరంగం.. సిమెంట్.. బ్యాటరీల పరిశ్రమలు అద్భుతమైన పురోగతి సాధించడంతో వాటి నుంచి భారీ మొత్తంలో జీఎస్టీ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక టైర్స్, స్టీల్, ఇతర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటవుతూ వస్తున్నాయి. శ్రీ సిటీలో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, విడిభాగాల తయారీ ఊపందుకుంది. విశాఖలోని ఫార్మా సిటీలో సైతం పలు పరిశ్రమలు ఉత్పత్తికి శ్రీకారం చుట్టాయి. మొత్తంగా పారిశ్రామిక రంగంలో 50.48 శాతం వృద్ధి నమోదైంది.
వ్యవసాయరంగంలో 63.19 శాతం వృద్ధి నమోదైంది. రెండేళ్లపాటు కోవిడ్ కారణంగా పలు రంగాలు ఘోరంగా దెబ్బతిన్నా కానీ ఆంధ్రాలో ఉత్పత్తి, పారిశ్రామిక రంగాలు రెండంకెల వృద్ధిని నమోదు చేసి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన కృషిని దేశానికీ వెల్లడించాయి. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం కూడా తెలుగుదేశం పాలనలో రూ.1,60,341 ఉండగా ఈ 2023 ఆర్థిక సంవత్సరంలో అది రూ. 2,19,518కు చేరింది. అంటే ప్రజల తలసరి ఆదాయంలో కూడా భారీ వృద్ధి నమోదైందన్నమాట. ఇలా అన్ని రంగాలూ ప్రగతిపథంలో పయనిస్తుంటే రాష్ట్రం కూడా పురోగతి సాధిస్తూ ఇతర రాష్ట్రాలకు అందని స్థాయిలో పరుగులు తీస్తోంది. దీనికి సీఎం వైఎస్ జగన్ దార్శనికత, సమర్థవంతమైన పాలనా.. ముందుచూపు.. ప్రణాళికల అమలు… ఆయా రంగాల ప్రాధామ్యాలు తెలుసుకుని వాటిని ప్రోత్సహించండం వంటి చర్యలే ప్రధాన కారణమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.