గొల్లపల్లి టీడీపీకి గుడ్ బై, వైసీపీలోకి ఎంట్రీ

టీడీపీకి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా..

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ వైసీపీ జాబితాలు వెలువడినప్పుడల్లా ఏదో ఒక కలకలం రేగుతూనే ఉండేది. కొందరు నేతలు పార్టీని వీడారు. ఇప్పుడు ఆ కలకలమంతా టీడీపీ, జనసేనలకు షిఫ్ట్ అయిపోయింది. ముఖ్యంగా జనసేన, టీడీపీ జాబితాలు విడుదల చేసినప్పటి నుంచి పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతున్నాయో తెలియకుండా ఉంది.

తాజాగా టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా చేశారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం జనసేనకు పోయింది. దీంతో తనకు టికెట్ దక్కే ఆస్కారమే లేదని భావించిన గొల్లపల్లి మనస్తాపంతో రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపించారు. పార్టీ పదవులకు.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Advertisement
గొల్లపల్లి టీడీపీకి గుడ్ బై, వైసీపీలోకి ఎంట్రీ

గొల్లపల్లి సూర్యారావు రాజీనామా అనంతరం వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు ఆఫీసులో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైస్సార్సీపీ కండువా కప్పుకున్నారు.

తను రాజీనామా చేయడానికి ముందే ఆయన ఎంపీ కేశినేని నానితో పాటు మిథున్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే రాజోలు స్థానం వైసీపీకి చెందిన రాపాక వరప్రసాద్‌కు ఫిక్స్ అని టాక్. గత ఎన్నికల్లో రాపాక జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్క నేత. ఆ తరువాత ఆయన వైసీపీలో చేరారు. అలాగే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గొల్లపల్లి.. రాపాక చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు రాజోలు టికెట్‌ను వైసీపీ గొల్లపల్లికి కేటాయిస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.