ఎగ్జిట్ పోల్స్‌కి ముందే జోష్.. గ్రాండ్ విక్టరీ ఖాయమంటున్న వైసీపీ

ఎగ్జిట్ పోల్స్‌కి ముందే జోష్.. గ్రాండ్ విక్టరీ ఖాయమంటున్న వైసీపీ

ఏపీలో ఎన్నికల ఫలితాలు కాక రేపుతున్నాయి. దీనికి మరో మూడు రోజులే సమయం ఉండటంతో వైసీపీ వర్గాలు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. టీడీపీ వర్గాలు బయట పెద్దగా కనిపించడమే లేదు. ఆ పార్టీ కీలక నేతలంతా ఏమయ్యారో కూడా తెలియడం లేదు. క్యాడర్‌లో ఏమాత్రం జోష్ కనిపించడం లేదు. ఈసారి కూడా ఓడిపోతామన్న నిర్ణయానికి వచ్చేశారో ఏమో కానీ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. వైసీపీ మాత్రం అలా లేదు. ప్రమాణ స్వీకారానికి డేట్, టైమ్ ఫిక్స్ చేసుకుని మరీ కూర్చొంది. వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు అయిన సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్‌తో పార్టీలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

ఇదే మంచిని కొనసాగిస్తూ..

‘‘దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది’’ అంటూ జగన్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. కచ్చితంగా ఏపీలో వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టం చేయనున్నాయని ఆ పార్టీ చెబుతోంది. తమ గెలుపు ఖాయమంటూ సంబరాలకు ఏర్పాట్లను సైతం వైసీపీ శ్రేణులు సిద్ధం చేస్తున్నాయి.

ఎగ్జిట్ పోల్స్‌కి ముందే జోష్.. గ్రాండ్ విక్టరీ ఖాయమంటున్న వైసీపీ

120 – 140 స్థానాల్లో విజయం..

వైనాట్ 175 అంటూ సీఎం జగన్ పార్టీ శ్రేణులను చాలా ఉత్తేజపరిచారు. దీంతో శ్రేణులు సైతం చాలా కష్టపడి పని చేశాయి. జగన్ కోసం కొందరు వలంటీర్లు రాజీనామాలకు సైతం వెనుకాడలేదు. సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా పార్టీకి చాలా కట్టుబడి ఉన్నారు. మహిళలంతా ఎండను సైతం లెక్క చేయక వచ్చి ఓటేశారు. ఇవన్నీ వైసీపీకి కలిసొస్తున్న అంశాలు. ఈసారి 175కి 175 రాకున్నా కూడా 120 – 140 స్థానాల్లో మాత్రం వైసీపీ విజయం తథ్యమని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. మొత్తానికి సంబరాలకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. జగన్ ప్రమాణ స్వీకారానికి సైతం ఓ పక్క ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.