మూడేళ్ల క్రితం రాజీనామా ఇప్పుడు ఆమోదం.. కారణమదేనా?

మూడేళ్ల క్రితం రాజీనామా ఇప్పుడు ఆమోదం.. కారణమదేనా?

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయట.. ఇప్పుడు ఏపీలో పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మూడేళ్ల క్రితం తన పదవికి రాజీనామా చేస్తే దానిని ఇప్పుడు అంగీకరించడం జరిగింది. దీనిపై గంటా ఫైర్ అయ్యారు. కనీసం రాజీనామా ఆమోదం తీసుకోవాలన్న సంప్రదాయాన్ని కూడా విస్మరించడంపై ఆయన మండిపడ్డారు. దీంతో జగన్ ఎంత పిరికివాడో నిరూపితమైందన్నారు.

గత ఎన్నికల్లో టీడీపీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అది కూడా 2021 ఫిబ్రవరి 12న. మూడేళ్ల తర్వాత తాజాగా ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. నిజానికి గతంలో ఒకసారి తన రాజీనామాను ఆమోదించాలంటూ స్పీకర్‌ను గంటా కలిశారు. కానీ ఆయన ఆమోదించలేదు.

మూడేళ్ల క్రితం రాజీనామా ఇప్పుడు ఆమోదం.. కారణమదేనా?

సడెన్‌గా ఇప్పుడు గంటా రాజీనామాను ఆమోదించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభ ఎన్నిక నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గంటా కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు. తాను వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తాననే భయంతోనే జగన్ తన రాజీనామాను అంగీకరింప చేశారని అంటున్నారు. అయితే వైసీపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మాత్రం తన రాజీనామాకు కట్టుబడి ఉన్నానన్నారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశంపై న్యాయ సలహా తీసుకుంటానని గంటా తెలిపారు.

Google News