పవన్ ఒక చెప్పు చూపిస్తే.. నేను రెండు చెప్పులు చూపిస్తా : పేర్ని నాని

పవన్ ఒక చెప్పు చూపిస్తే.. నేను రెండు చెప్పులు చూపిస్తా : పేర్ని నాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్నినాని(Perni Nani) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండు చెప్పులు చూపించి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వాహనం వారాహి కాదని నారాహిగా పెట్టుకుని ఉంటే బాగుండేదన్నారు. పదేళ్లుగా జనసేన పార్టీ(Janasena Party)ని నడుపుతున్నది చంద్రబాబేనన్నారు. పవన్ పూటకొక మాట మాట్లాడుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం తన సినిమాలను అడ్డుకుంటోందని విమర్శించారని.. ఏ సినిమాను ఆపామో చెప్పాలని నిలదీశారు. పవన్ పూటకొక మాట మాట్లాడుతూ.. రోజుకొక డైలాగ్ చెబుతున్నారన్నారు. చంద్రబాబు బాగుండటం కోసం పవన్ ఏం చేయడానికైనా సిద్ధమేనని పేర్ని నాని(Perni Nani) అన్నారు.

ప్రజలను నమ్ముకుంటే అసెంబ్లీలో సీట్లు వస్తాయి కానీ.. వ్యూహాలను నమ్ముకుంటే శాసనసభలో కూడా అడుగు పెట్టలేరని పేర్ని నాని(Perni Nani) ఎద్దేవా చేశారు. సీఎం పదవి ఏమైనా దానంగా వచ్చేదా? అని నిలదీశారు. చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ ఇంత దిగజారడమేంటని ప్రశ్నించారు. కేవలం ఆఫీసులో కూర్చొని సినిమా డైలాగ్‌లు, సొల్లు కబుర్లు చెప్పడం తప్ప ఏనాడైనా చంద్రబాబు చొక్కా పట్టుకుని నిలదీశారా? అని పేర్ని నాని అడిగారు. పవన్ ఒక చెప్పు చూపిస్తే తాను రెండు చెప్పులు చూపిస్తానన్నారు. హరీష్ రావు(Harish Rao) ఆంధ్ర రాష్ట్రాన్ని తిడుతుంటే పవన్ ఏం చేశారని ప్రశ్నించారు. తన ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు పవన్.. కేసీఆర్(KCR) కాళ్లు మొక్కుతాడని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

Google News