సొంతింటి కల నిజమైన వేళ.. జగన్ వల్లే టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశం!

సొంతింటి కల నిజమైన వేళ.. జగన్ వల్లే టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశం!

నిలువ నీడ లేని పేదవారికి నివసించేందుకు కాస్త స్థలం కావాలని ఎవరు కోరుకోరు. దిగువ, మధ్య తరగతి ప్రజలు సొంతింటి కోసం కళ్లు కాయలు కాసలా ఎదురు చూస్తుంటారు. నిజానికి టిడ్కో గృహాలు పేదలపాలిట మహా సౌధాలు. అయితే వీటిని తామే నిర్మించారని.. జనాలకు ఇవ్వటానికి జగన్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాదు.. టీడీపీ కేవలం రాయి మాత్రమే వేసింది. దానిని నివాసయోగ్యంగా మలిచింది తామేనని వైసీపీ నేతలు అంటున్నారు.

టిడ్కో ఇళ్లు ఎవరు నిర్మించారు?

అయితే వీటిని ఎవరు నిర్మించారు..? ఎవరు వీటి కోసం ఎక్కువ నిధులు కేటాయించారు? అనేది చాలా మందికి తెలియదు. పేదలకు తక్కువ ధరకే, ఇంకా చెప్పాలంటే 300 అడుగులున్న చిన్న ఫ్లాట్స్ ఐతే ఉచితంగానే ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మిగతా 365, 430 అడుగుల ఫ్లాట్స్ ను సగం ధరకే ప్రజలకు అందించారు . ఇంకా అక్కడ తాగునీరు, రోడ్లు, విద్యుత్ ఇతర సౌకర్యాలకు సైతం భారీగా నిధులు విడుదల చేశారు. లక్షలమంది కళ్ళలో సంతోషాన్ని విరబూయించేందుకు సకలం సిద్ధం చేస్తున్నది మాత్రం సీఎం జగనే అనడంలో సందేహం లేదు.

Ys Jagan

మొత్తం ప్రాజెక్టు నిధుల్లో కనీసం పదిపైసల వంతు కూడా ఖర్చు చేయకుండానే అంతా తామే చేశామంటూ అక్కడ సెల్ఫీలు దిగి ప్రజలను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు మభ్యపెడుతున్నారు. అసలు వాస్తవాలను ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. 

టిడ్కో ఇళ్లు – అసలు వాస్తవాలేంటంటే..

  • టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలంటే మొత్తం ఖర్చు చేయాల్సింది రూ.28వేల కోట్లపైనే.
  • కాని చంద్రబాబు ప్రభుత్వం సగం కంటే తక్కేవ ఖర్చుచేసి.. తామే కట్టేశామనడం అవాస్తవం.
  • వైఎస్‌.జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్లపై ఇప్పటివరకూ రూ.8734 కోట్లు ఖర్చు చేసింది.
  • రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నా కూడా ఇప్పటికే 62000 ఇళ్లు పూర్తి చేశారు.
  • టిడ్కో ఇళ్లు మురికి కూపాలుగా మారిపోకుండా మౌలిక సదుపాయాలు కోసం దాదాపు మూడు వేలకోట్లు ఖర్చుపెట్టింది.
  • రోడ్లు, సీవరేజి…ఇలా అద్భుతమైన నివాస సముదాయాలుగా మార్చింది.
  • గత ప్రభుత్వం వదిలివెళ్లిపోయిన బిల్స్ రూ.3వేల కోట్ల బకాయిలు కూడా తీర్చింది.
  • చంద్రబాబు ప్రభుత్వం హయాంలో 300 అడుగుల టిడ్కో ఇల్లు కోసం లబ్ధిదారులు నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లపాటు ఋణం చెల్లించాలి. అంటే ఇరవయ్యేళ్ళ తరువాత ఆ మొత్తం దాదాపు రూ. 7.2 లక్షలు అవుతుంది  
  • అయితే ఆ 300 అడుగుల ఇంటిని జగన్‌ ప్రభుత్వం ఉచితంగా లబ్ధిదారులకు ఇస్తోంది. దీని వల్ల ప్రభుత్వంపై భారం రూ. 5,340 కోట్లు. కానీ ప్రభుత్వం ప్రజలకోసం ఆ భారాన్ని భరిస్తోంది. 
  • 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఫ్లాట్ల అడ్వాన్స్‌ చెల్లింపుల్లో 50 శాతం రాయితీ కూడా ప్రభుత్వం భరించింది.
  • దీనిపై ప్రభుత్వంపై అదనపు భారం మరో రూ.482.31 కోట్లు.
  • ఉచిత రిజిస్ట్రేషన్‌ రూపంలో రూ.1200 కోట్ల ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తోంది.
  • 1,43,600 మందికి ఒక్క రూపాయికే 300 అడుగుల ఫ్లాట్స్ మంజూరు 
  • 365, 430 అడుగులతో కలిపి మొత్తం ఫ్లాట్స్ 2. 62 లక్షలు 
  • సబ్సిడీల రూపంలో రూ.14,514 కోట్లు 
  • ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో రూ.1200 కోట్లు 
  • మొత్తం ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ. 18,714 కోట్లు 
  • ఇప్పటికే లబ్ధిదారులకు అప్పగించినవి 61,948
  • ఈ ఏడాది చివరకు అందించే ఫ్లాట్స్ 2, 62, 216
సొంతింటి కల నిజమైన వేళ.. జగన్ వల్లే టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశం!

ఇవీ.. టిడ్కో ఇళ్ల వెనుక ఉన్న అసలు వాస్తవాలు. ఈ ఏడాది చివరి నాటికి లబ్దిదారులందరి ఇళ్లల్లో వెలుగులు నింపే లక్ష్యంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళుతోంది.

Google News