రేపటి నుంచి పవన్ వారాహి యాత్ర.. సత్ఫలితాన్ని ఇస్తుందా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తలపెట్టిన మహాయాగం ఈరోజు సాయంత్రానికి పూర్తి కానుంది. అనంతరం ఆయన అన్నవరం వెళ్లి సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటారు. సత్యదేవుని దర్శనం అయిన వెంటనే రేపటి నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. వారాహి(Varahi) నుంచి పవన్ కల్యాణ్ తొలి బహిరంగ సభ కత్తిపూడి కూడలిలో నిర్వహించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పవన్ పర్యటించనున్నారు. ఇప్పటికే యాత్రకు సంబంధించిన షెడ్యూల్ అంతా ఖరారైంది. అన్నవరం నుంచి నరసాపురం వరకూ షెడ్యూల్ ఖరారు అయ్యింది.
ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో విపక్ష నేతలంతా యాత్రల బాట పట్టారు. అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాతయాత్ర నిర్వహిస్తుండగా.. తాజాగా పవన్ వారాహి యాత్ర(Varahi Yatra) చేపట్టారు. ప్రజలతో మమేకమయ్యేందుకు ఈ యాత్రలు ఎంతగానో సహాయపడతాయని నేతలు నమ్ముతున్నారు. గతంలో కూడా ఇలాంటి యాత్రలు సత్ఫలితాన్ని సాధించాయి. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రతినిధులను కలిసి వారితో చర్చించాలని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిర్ణయించారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఈ యాత్రను వినియోగించుకోనున్నారు. మరి ఈ యాత్ర ఆయనకు ఎలా ఉపయోగపడుతుందో మున్ముందు చూడాలి.
జనసేన వారాహి విజయ యాత్ర షెడ్యూల్ (Janasena Varahi Yatra Schedule)
14 జూన్ 2023 – వారాహి నుంచి ప్రత్తిపాడు నియోజకవార్గం కత్తిపూడిలో సభ
16 జూన్ 2023 – పిఠాపురంలో వారాహి యాత్ర. సభ
18 జూన్ 2023 – కాకినాడలో వారాహి యాత్ర. సభ
20 జూన్ 2023 – ముమ్మిడివరంలో వారాహి యాత్ర. సభ
21 జూన్ 2023 – అమలాపురంలో వారాహి యాత్ర. సభ
22 జూన్ 2023 – పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా వారాహి యాత్ర.
రాజోలు నియోజకవర్గం మలికిపురంలో సభ
23 జూన్ 2023 – నరసాపురంలో వారాహి యాత్ర. సభ