తెలంగాణ బీజేపీ వర్గాలుగా విడిపోతుందా? ఈటలపై నేతల ఫైర్..

తెలంగాణ బీజేపీ వర్గాలుగా విడిపోతుందా? ఈటలపై నేతల ఫైర్..

తెలంగాణ బీజేపీ(Telangana BJP) వర్గాలుగా విడిపోతుందా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి వ్యతిరేకంగా ఓ వర్గం తయారైంది. అలాగే ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌(Etela Rajender)కి వ్యతిరేకంగా మరో వర్గం తయారవుతోంది. ఈటల వ్యవహారశైలిపై సీనియర్‌ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈటల హస్తినకు వెళ్లడం కొందరు నేతలకు రుచించడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇక్కడే ఉండగా ఈటల(Etela Rajender)కు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ మండిపడుతున్నారు. పార్టీ నియమావళిని పాటించకుండా ఢిల్లీకి వెళ్లి లీకులు ఇవ్వాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. 

ఈ మేరకు పలువురు సీనియర్లు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌, విజయశాంతి, వివేక్‌ తదితరులు హాజరయ్యారు. కనీసం పార్టీ ప్రోటోకాల్‌ను పాటించకుండా ఇలాంటి లీకులు ఇస్తే.. అది క్యాడర్‌కు ఎలాంటి సంకేతాలను ఇస్తుందని ప్రశ్నించారు.

Advertisement

తనకు చేరికల కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగిస్తే దాదాపు 30 మందిని పార్టీలోకి తీసుకొస్తానని అధిష్టానానికి ఈటల(Etela Rajender) చెప్పినట్టు అప్పట్లో ప్రచారం జరిగిన విషయాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. కానీ ఏ ఒక్కరినీ ఈటల తీసుకురాలేకపోయారని.. ఇప్పుడు ఈటల(Etela Rajender)కు మరో పదవి ఇస్తే ఎలా సక్సెస్ అవుతారని నేతలు చర్చించుకున్నట్టు సమాచారం.