తెలంగాణలో హాట్ టాపిక్‌గా కాంగ్రెస్.. వరుస భేటీలతో హీటెక్కుతున్న రాజకీయం

తెలంగాణలో హాట్ టాపిక్‌గా కాంగ్రెస్.. వరుస భేటీలతో హీటెక్కుతున్న రాజకీయం

కర్ణాటక(Karnataka)లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణ(Telangana)లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ అనూహ్యంగా ముందుకు దూసుకొచ్చింది. ఇదే ఊపుతో వెళితే రేపు బీఆర్ఎస్‌కు చుక్కలు చూపించడం ఖాయంగానే కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్(BRS), ఇటు బీజేపీ(BJP)లో అసంతృప్త నేతలంగా బీజేపీ వైపే చూస్తున్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కీలక నేత మల్లు రవితో జూపల్లి, దామోదర్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక అక్కడి నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు రేవంత్ రెడ్డితో కలిసి కర్ణాటక వెళ్లి పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు.

ఇక బెంగుళూరులో జరిగిన సమావేశానికి సంబంధించిన విషయాలను రేవంత్, డీకే శివకుమార్‌(DK Shiva Kumar)లు అధిష్టానానికి వివరించారు. ఇక నేడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy VenkatReddy)తో పొంగులేటి, జూపల్లి భేటీ అయ్యారు. మొత్తానికి పార్టీలో చేరడానికి ముందు కీలక నేతలందరితో వీరు భేటీ అవుతున్నారు. ఇప్పటికైతే పొంగులేటి, జూపల్లి, దామోదర్ రెడ్డిలు పార్టీలో చేరడం కన్ఫర్మ్ అయిపోయింది. ఎప్పుడు చేరుతామనే ప్రకటన నేడో రేపో చేసే అవకాశం ఉంది. ఇక వీరు చేరిన అనంతరమే కాంగ్రెస్ పార్టీకి మరిన్ని వలసలు పెరగవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత స్ట్రాంగ్ అవడం ఖాయం.