పవన్ కల్యాణ్ నోట పదే పదే ఒకటే మాట.. అసలు ఏపీలో ఏం జరుగుతోంది?

పవన్ కల్యాణ్ నోట పదే పదే ఒకటే మాట.. అసలు ఏపీలో ఏం జరుగుతోంది?

ఏపీ(Andhra Pradesh)లో ముందస్తు ఎన్నికలు అనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే ఈ మధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) నోటి వెంట చాలా ఎక్కువగా వినిపిస్తోంది. అంతకు ముందు లైట్ తీసుకున్న జనం.. ఇప్పుడు అంటే పవన్ నోటి వెంట పదే పదే వినబడుతుందో ముందస్తు అనేది హాట్ టాపిక్‌గా మారింది.

అసలు పవన్ ఏమంటున్నారంటే.. ‘‘ఈసారి ఏపీలో ముందస్తు ఎన్నికలు పక్కా. నవంబర్ లేదంటే డిసెంబర్‌లో ఎన్నికలకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌తో చర్చలు కూడా జరిపారు. పైకి మాత్రం ముందస్తు లేదంటూ జగన్(YS Jagan) డ్రామాలు ఆడుతున్నారు’’ అని అంటున్నారు.

పవన్(Pawan Kalyan) పదే పదే ఇదే మాట చెబుతుండటంతో ఆయనకు ఏదో పక్కా సమాచారం ఉండే ఉంటుందని అనుకుంటున్నారు. దీనిపై రెండు రకాల కథనాలు అయితే వినిపిస్తున్నాయి. పవన్ కావాలనే.. తమ పార్టీ క్యాడర్‌ను అలర్ట్ చేయడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఒక కథనం. లేదు.. పక్కా సమాచారం పవన్ వద్ద ఉంది.. లేదంటే ఎందుకిలా కామెంట్స్ చేస్తారని మరో కథనం.

ఇటు చంద్రబాబు కూడా ముందస్తు గురించి తమ పార్టీ నేతలు, కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. అయితే జగన్ కేబినెట్ మీటింగ్ పెట్టినా కూడా పరోక్షంగా ముందస్తు విషయాన్ని ప్రస్తావించలేదు. దీంతో అసలు ఏపీ ప్రభుత్వం ముందస్తుకు వెళుతుందా? లేదా? అనేది సందేహంగా మారింది.

Google News