పవన్ ఒక రాజకీయ వ్యభిచారి : ఎమ్మెల్యే ద్వారంపూడి

పవన్ ఒక రాజకీయ వ్యభిచారి : ఎమ్మెల్యే ద్వారంపూడి

దమ్ముంటే కాకినాడ నుంచి పోటీ చేయి.. నిన్ను తుక్కుతుక్కుగా ఓడించకపోతే నా పేరు చంద్రశేఖరే కాదు’ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నేడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ డ్రగ్స్ తీసుకుంటాడని చాలా మంది చెబుతుంటాన్నారు. పవన్ ఒక రాజకీయ వ్యభిచారి అని ద్వారంపూడి మండిపడ్డారు.

నిన్న కాకినాడ సభలో పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు నేడు ద్వారంపూడి కౌంటర్ ఇచ్చారు. ప్యాకేజీ చాల్లేదని వారాహి ఎక్కి తిరుగుతున్నాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అసలు తనను విమర్శించే స్థాయి పవన్‌కు లేదన్నారు.

మూడు నెలల క్రితం తనకు సీఎం అయ్యే అర్హత లేదన్న పవన్.. సీట్ల ఒప్పందం కుదరకపోవడంతో తనను సీఎం చేయాలని అడుగున్నారన్నారు. మార్చి 14న ఒక మాట.. జూన్ 18న ఒక మాట మాట్లాడతావా? అంటూ పవన్‌పై ద్వారంపూడి మండిపడ్డారు. తాను తలుచుకుంటే జనసేన బ్యానర్లను కూడా కట్టనివ్వనన్నారు. పవన్ రెండు చోట్ల ఓడిపోతే.. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాన్నారు.

ఎవడో చెప్పిన మాటలు విని కోతిలా గంతులు వేయవద్దన్నారు. న్మలో పవన్ తనను బేడీలు వేసి కొట్టలేడన్నారు. ఎవడో చెప్పిన మాటలు విని కోతిలా గంతులు వేయవద్దని ద్వారంపూడి హితవు పలికారు. దమ్ముంటే పవన్ కాకినాడ నుంచి పోటీ చేయాలని పవన్‌కు ద్వారంపూడి సవాల్ విసిరారు.

Google News