ఏపీలో రేవంత్ ప్రచారం? ఇంట్రస్టింగ్ విషయమేంటంటే..

ఏపీలో రేవంత్ ప్రచారం? ఇంట్రస్టింగ్ విషయమేంటంటే..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ వేస్తున్నారు. ఇప్పటి వరకైతే ప్రజారంజరక పాలనే చేస్తున్నారు. మూడు నెలల పాలనపై విమర్శలు కూడా పెద్దగా ఏమీ లేవు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. వీటిలోనూ తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా అని సర్వేలే కాదు.. తెలంగాణ ప్రజానీకం కూడా చెబుతోంది. ఈక్రమంలోనే బీఆర్ఎస్.. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంది. సరే.. ఆ పొత్తుల బాగోతం ఎలా ఉన్నా రేవంత్ బాగా స్ట్రాంగ్ అయిపోయారనడంలో సందేహమే లేదు.

ఇక ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రేవంత్ ప్రచారం చేయబోతున్నారని టాక్. ఇక్కడ కానీ రేవంత్ ప్రచారం చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనేది హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీని ఏకి పారేస్తారనడంలో సందేహమైతే లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని షర్మిల కాస్త కూస్తో ఉనికిలోకి తీసుకొచ్చారు. ఇక రేవంత్ ఎంట్రీ ఇస్తే పూర్తి స్థాయిలో ఉనికిలోకి వస్తుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు.  తెలంగాణ యాసలో ఏపీ ప్రజానీకాన్ని జగన్ ఆకట్టుకుంటారనడంలో అనుమానమే లేదు.

అయితే ఇక్కడ ఒక ఇంట్రస్టింగ్ విషయం ఒకటి ఉంది. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌లో చేరాక ఆయన ఈనాటి వరకూ టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించిందే లేదు. కనీసం ఆ పార్టీ నేతలను సైతం పల్లెత్తి మాట అనలేదు. ఇప్పుడు ఏపీ ఎన్నికల ప్రచారంలో వైసీపీని, దాని అధినేతను మాత్రమే విమర్విస్తే అంత బాగోదు. పక్కాగా టీడీపీని సైతం విమర్శించాల్సిందే. మరి రేవంత్ విమర్శిస్తారా? ఒకవేళ విమర్శిస్తే ఏ అంశాలపై విమర్శిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Google News