మానవ వనరులపై పెట్టుబడులు.. ఏపీ విధానాలపై ఐఎంఎఫ్ ప్రశంసల జల్లు

మానవ వనరులపై పెట్టుబడులు.. ఏపీ విధానాలపై ఐఎంఎప్ ప్రశంసల జల్లు

మానవ వనరులపై పెట్టుబడులు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ విధానాలను తాజాగా ఐఎంఎఫ్ ప్రశంసించింది. ఏపీ విద్యార్థి బృందం ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వాషింగ్టన్ డీసీలోని అంతర్జాతీయ ద్రవ్య నిధి కార్యాలయాన్ని సందర్శించింది.

అక్కడ ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్‌తో సహా భారతదేశ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. సుబ్రమణియన్ (మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు)తో విద్యార్థులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మానవ వనరులపై పెట్టుబడులు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ విధానాలను అధికారులకు వివరించారు.

అవి విన్న ఐఎంఎఫ్ అధికారులు.. ఏపీపై ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే ఏపీ అనుసరిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలు సైతం అనుసరించాలని ఐఎంఎఫ్ అధికారులు సూచించారు.

తన విజయగాథనే ఉదాహరణగా..

ఈ సందర్భంగా ఐఎంఎఫ్ అధికారులు ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘విద్యార్థులు ఆత్మస్థైర్యం, ధృఢసంకల్పంతో చదువుకుని మన దేశానికి తిరిగి మంచి ఉత్సాహంతో పని చేసి దేశ కీర్తి చాటి చెప్పాలి. విద్యార్ధులు జీవితంలో ఎలా విజయం సాధించాలనే దానిపై మార్గదర్శకత్వం, చిట్కాలను స్వీకరించటం గొప్ప విషయం. నా చదువే నన్ను ఐఎంఎఫ్ లో ప్రముఖ వ్యక్తిగా నిలబెట్టింది’’ అని భారతదేశ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.సుబ్రమణియన్ తన వ్యక్తిగత విజయగాథను ఉదాహరణగా తెలిపారు.

మానవ వనరులపై పెట్టుబడులు.. ఏపీ విధానాలపై ఐఎంఎప్ ప్రశంసల జల్లు

ఇక ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్‌ మాట్లాడుతూ.. ‘‘మీ కలలను అనుసరిస్తూ మీరు ఎన్నుకన్న మార్గంలోనే మందుకు సాగి ఎత్తైన శిఖరాలు చేరుకోవాలి’’ అన్నారు. ఇంకా తాను ఐఎంఎఫ్‌లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎదిగేవరకు చేసిన తన కృషిని, తన అద్భుతమైన ప్రయాణాన్ని విద్యార్ధులతో పంచుకున్నారు. దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలను అందుకోగలరంటూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా గీతా గోపీనాథ్ మాట్లాడారు.

మానవ వనరులపై పెట్టుబడులు.. ఏపీ విధానాలపై ఐఎంఎప్ ప్రశంసల జల్లు

అద్భుతమైన అవకాశం..

కె.సుబ్రమణియన్, గీతా గోపీనాథ్ వంటి నిష్ణాతులైన వ్యక్తులతో విద్యార్ధుల సమావేశం నిస్సందేహంగా వారికొక ప్రేరణగా నిలుస్తాయని చెప్పటంలో అతిశయోక్తి లేదు.విద్యార్ధులకు అద్భుతమైన ప్రపంచ వేదికను అందించే లక్ష్యంతో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పర్యటన, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల పనితీరుపై అంతదృష్టిని పెంపొదింపజేసేందుకు, విశేషమైన విజయాన్ని సాధించిన నిష్ణాతులైన వ్యక్తుల నుంచి నేర్చుకోవడానికి విద్యార్దులకు ఒక అద్భుతమైన అవకాశంగా పరిగణించవచ్చు.

మానవ వనరులపై పెట్టుబడులు.. ఏపీ విధానాలపై ఐఎంఎప్ ప్రశంసల జల్లు

మన విద్యార్ధుల్లో స్థైర్యాన్ని నింపిన కె సుబ్రమణియన్ , గీతా గోపీనాథ్ వంటి అధికారుల కృషికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. వారి మార్గదర్శకత్వం, ప్రేరణ విద్యార్థుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని తెలిపింది. శ్రేష్ఠత కోసం కృషి చేయడానికి.. సమాజంపై సానుకూల ప్రభావం చూపడానికి వారిని శక్తివంతం చేస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం అభిప్రాయపడింది.

మానవ వనరులపై పెట్టుబడులు.. ఏపీ విధానాలపై ఐఎంఎప్ ప్రశంసల జల్లు