కొంపదీసి జేడీ వైసీపీలో చేరుతున్నారా ఏంటి?

Jd Lakshminarayana

ఊరకరారు మహానుభావులు అన్నట్టుగా.. ఊరికే మహానుభావులు మాట్లాడరు. వారి మాటల వెనుక అర్థాలు, పరమార్థాలు వేరే ఉంటాయి. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. జేడీ వైసీపీకి చెందిన మనిషేం కాదు కానీ ఇవాళ వైసీపీని పొగిడి హాట్ టాపిక్‌గా మారారు. ఏపీలో విద్యా, వైద్య రంగంలో గణనీయమైన మార్పులు వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చాయని ఆయన అన్నారు. అంతే అందరూ ముక్కున వేలేసుకున్నారు.

సీబీఐ నుంచి బయటకు వచ్చేశాక జేడీ పాలిటిక్స్‌లో బాగా బిజీ అయిపోయారు. అయితే జేడీ వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏమై ఉంటుందా? అని ఏపీలో పెద్ద ఎత్తున చర్ జరుగుతోంది. అయితే ఆయన చేసే వ్యాఖ్యలన్నీ నిర్మాణాత్మకంగానే ఉంటాయని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. దీనికి అప్పట్లో పరిపాలన వికేంద్రీకరణను సమర్థించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మేధావి వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన వ్యాఖ్యల వెనుక ప్రజోపయోగమే ఉంటుందంటున్నారు. 

ఇక కొందరు మాత్రం ఎన్నికల సమయం కాబట్టి అలా కొట్టిపారేయడానికి వీల్లేదంటున్నారు. వైసీపీని పొగడటం వెనుక లోగుట్టు మరొకటి ఉంది అంటున్నారు. నిజానికి ఆయన విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ఎప్పటి నుంచో చెప్పుకు వస్తున్నారు. అయితే టీడీపీ – జనసేన కూటమికి అభ్యర్థులకు లోటు లేదు. బీజేపీకి కూడా కేవలం ఒక్క విశాఖ నుంచి అయితే బాగానే అభ్యర్థులున్నారు. ఇక ఛాన్స్ ఉందల్లా వైసీపీని నుంచే. దీంతో కొంపదీసి జేడీ వైసీపీలో చేరుతున్నారా.. ఏంటనే చర్చ విపరీతంగా జరుగుతోంది. పైగా వైసీపీ ఆయనను ఆహ్వానించిందని కూడా అంటున్నారు.  ఈ క్రమంలో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టే ఆ పార్టీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారని అంతా అంటున్నారు.

Google News