కావలిలో బస్సు డ్రైవర్‌పై దాడి చేసింది టీడీపీ, జనసేన రౌడీమూకలే..!

కావలిలో బస్సు డ్రైవర్‌పై దాడి చేసింది టీడీపీ, జనసేన రౌడీమూకలే..!

నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి ఘటన ఎంత సంచలనం సృష్టించినదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఐతే ఈ డాడీ చేసింది వైసీపీ కార్యకర్తలే అని ప్రతిపక్షాలు.. మీడియా దుమ్మెత్తి పోశాయి. సీన్ కట్ చేస్తే షాకింగ్ విషయాలు ఇప్పుడిప్పుడే బయటికివస్తున్నాయి. ఈ దాడికి కర్త కర్మ క్రియ అన్నీ టీడీపీ, జనసేన కార్యకర్తలే అని తేలింది. విజయవాడ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు కావలి మీదుగా విజయవాడ వెళుతుండగా.. కావలిలో అడ్డుగా ఓ బైక్ వచ్చింది. దానిని తొలగించాలని డ్రైవర్ రాసింగ్ హారన్ కొట్టాడు. కానీ ఆ టు వీలర్‌కు చెందిన వ్యక్తి గొడవకు దిగాడు. అక్కడే ఉన్న పోలీసులు ద్విచక్రవాహనదారుడికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపేశారు.

Tdp Activist3

అయితే సదరు వ్యక్తి మరో 14 మంది రౌడీ మూకను వెంటబెట్టుకుని ఆర్టీసీ బస్సును వెంబడించాడు. నెల్లూరు పట్టణ శివారులోని మద్దూరుపాడు వ్యవసాయ మార్కెట్ కమిటి గోదాముల వద్ద బస్సును అడ్డగించాడు.బస్సు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడికి పాల్పడింది టీడీపీ, జనసేన కార్యకర్తలేనని తెలుస్తోంది.ఆర్టీసీ డ్రైవర్‌పై కావలిలో దాడి చేసిన రౌడీలు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీకి చెందినవారేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కూడా స్పష్టం చేశారు.

Tdp Activist

దాడి చేసిన రౌడీలు ‘ఐ సపోర్ట్‌ బాబు..’ అంటూ బ్యానర్లు పట్టుకున్నట్లు తెలిపారు. ఆధారాలతో సహా రౌడీ మూకల ఫో­టోలను మీడియాకు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి విడుదల చేశారు. నిందితుల్లో ఒకరు జనసేన జెండా కప్పుకోగా మరొకరు బీజేపీ నేత అనుచరుడిగా ఉన్నట్లు చెప్పారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 217/23 u/s 143, 341, 332, 307, 323, 427, IPC, Dt.26.10.23 కింద కేసు నమోదు చేశారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దొంగలే దొంగ దొంగ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Tdp Activist4
కావలిలో బస్సు డ్రైవర్‌పై దాడి చేసింది టీడీపీ, జనసేన రౌడీమూకలే..!
Google News