పవన్ ఎంపీగా పోటీ చేసేది అందుకా?

పవన్ ఎంపీగా పోటీ చేసేది అందుకా?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించి ఇటీవలి కాలంలో ఓ ఆసక్తికర వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే పవన్ ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేతో పాటు ఎంపీ అభ్యర్థిగా కూడా రంగంలోకి దిగుతారట. ఇక ఎమ్మెల్యేగా తొలుత ఆయన భీమవరం నుంచి పోటీకి దిగుతారని ప్రచారం జరిగింది. ఆ తరువాత భీమవరం నుంచి కాదు.. పిఠాపురం నుంచి బరిలోకి దిగుతారంటూ ప్రచారం జరిగింది. పిఠాపురం కాపు ఓటు బ్యాంకు ఎక్కువ కావడంతో పిఠాపురం నుంచి పవన్ పోటీ ఖాయమనే అంతా భావించారు.

అయితే తరువాత సీన్ మారిపోయింది. పవన్ గత ఎన్నికల్లో ఓటమి పాలైన గాజువాక నుంచి పోటీ చేయాలని భావిస్తు్న్నారట. ఇప్పుడు టీడీపీతో జట్టు కట్టడంతో ఆ స్థానం కూటమికి కంచుకోటగా మారిందట. ఈ క్రమంలోనే పవన్ అక్కడి నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించాలని చూస్తున్నారని టాక్. ఇక కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఎంపీగా విజయం సాధిస్తే కేంద్ర మంత్రి హోదా కల్పిస్తామని బీజేపీ పెద్దలు పవన్‌కు హామీ ఇచ్చారని టాక్.

Advertisement

అలాగే మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఎంపీగా గెలిచిన వెంటనే పవన్ జనసేనను టీడీపీ లేదంటే బీజేపీలో విలీనం చేస్తారని.. అలా చేసేలా టీడీపీ స్కెచ్ గీసిందని ఏపీలో చర్చించుకుంటున్నారు. అలా పవన్‌ను సైడ్ చేసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు అధినేత చంద్రబాబు పట్టం కట్టాలని చూస్తున్నారని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో నిజమెంతో కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇక పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయమై మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు.