గీతాంజలి కేసులో టీడీపీ రాంబాబు అరెస్ట్

Geetanjali case - Rambabu

గీతాంజలి ఆత్మహత్య కేసులో తెనాలి పోలీసులు మొదటి అరెస్ట్ చేశారు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త రాంబాబుని విజయవాడ సింగ్ నగర్లో అరెస్ట్ చేశారు.

జగన్ అన్న వల్లే తనకు ఇల్లు, అమ్మ ఒడి వచ్చింది అని చెప్పిన గీతాంజలిని, తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా టీం ట్రోలింగ్ చేసింది. ఆ ట్రోలింగ్ భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలిచివేసింది. దాంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. తాజాగా తెనాలి పోలీసులు రాంబాబుని అదుపులోకి తీసుకున్నారు.

గీతాంజలిని బూతులతో తిడుతూ రాంబాబు చేసిన ట్వీట్ లని, సోషల్ మీడియా పోస్టులను పోలీసులు ఇప్పటికే ఆధారాలుగా సేకరించారు.

ఈ కేసులో ఇంకా మరికొన్ని అరెస్టులు జరగనున్నాయి. విదేశాల్లో ఉండి సోషల్ మీడియాలో వేధించిన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మరి.

Google News