Pawan Kalyan: పవన్ పోటీ చేసే స్థానంపై క్లారిటి వచ్చినట్టేనా?

పవన్ పోటీ చేసే స్థానంపై క్లారిటి వచ్చినట్టేనా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీపై ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి దెబ్బతిన్న పవన్ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీ అధినేతలందరి పోటీ విషయంలో స్పష్టత అయితే ఉంది ఒక్క పవన్ విషయంలో తప్ప. అయితే ఇటీవల పవన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. 

ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు. ఇక ఏపీలో మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీలన్నింటికీ ఈ ఆరునెలలే కీలకం. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాల్లో ఓ ఊపొచ్చింది. ఈ క్రమంలోనే టీడీపీతో పవన్ పొత్తు ప్రకటన చేశారు. కాగా.. ఏపీలో మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయమై పవన్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. 

గతంలో ప్రజారాజ్యం పార్టీని ప్రకటించింది.. అలాగే ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చిరంజీవి పోటీ చేసింది తిరుపతి కావడం గమనార్హం. తిరుపతి ప్రజలు సైతం చిరును అక్కున చేర్చుకున్నారు. ఆయనకు ఘన విజయాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు పవన్ కూడా తిరుపతి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. పైగా చిత్తూరులో కాపు సామాజిక వర్గానికి చెందిన బలిజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి పోటీ చేస్తే వారి ఓటు బ్యాంకు కలిసొస్తుందని భావిస్తున్నారట. పైగా చిత్తూరు జిల్లాల్లో ఇప్పుడిప్పుడే వైసీపీ బాగా పుంజుకుంటోంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే పవన్ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే పోటీ చేస్తే బాగుంటుందని చంద్రబాబు కూడా సూచించారట. మొత్తానికి జనసేనాని తిరుపతి నుంచి పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

Google News