తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. మొత్తంగా ఐదు రాష్ట్రాలకు కలిపి ఒకేసారి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను నేడు విడుదల చేసింది. తెలంగాణ, మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఒకేసారి ఎన్నికలను నిర్వహించనున్నట్టు సీఈసీ తెలిపింది. ఈ ఐదు రాష్ట్రాల్లోని శాసన సభల కాలపరిమితి డిసెంబర్ 2023, జనవరి 2024 మధ్య ముగియనుంది. సాధారణంగా శాసనసభ గడువు ముగియడానికి దాదాపు ఎనిమిది వారాల ముందు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేస్తుంది.

తెలంగాణ అసెంబ్లీ ప్రస్తుత పదవీ కాలం 16 జనవరి 2024 నాటికి ముగియనుంది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో సైతం ఇంచుమించుగా ఇదే సమయానికి అసెంబ్లీ ప్రస్తుత పదవీ కాలం ముగియనుంది. దీంతో ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాలకు కలిపి ఒకేసారి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు సీఈసీ తెలిపింది.

Advertisement

తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడంటే..

నవంబర్ 10 నామినేషన్లు

నవంబర్ 13న స్క్రూట్నీ

నవంబర్ 14 లోపు నామినేషన్ల విత్ డ్రా

తెలంగాణలో పోలింగ్ నవంబర్ 30 (గురువారం)

మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడంటే..

కౌంటింగ్ డిసెంబర్ 3

రాజస్థాన్ లో నవంబర్ 23న పోలింగ్

మధ్యప్రదేశ్ ,మిజోరాంలో నవంబర్ 7న పోలింగ్

చత్తీస్ ఘడ్ లో రెండు విడతల్లో పోలింగ్

నవంబర్ 7,17 తేదీల్లో చత్తీస్ ఘడ్ లో పోలింగ్