షాకింగ్.. అవినాష్ ఔట్.. అభిషేక్ ఇన్.. నిజమెంత!

షాకింగ్.. అవినాష్ ఔట్.. అభిషేక్ ఇన్.. నిజమెంత!

కడప ఎంపీ అభ్యర్థిని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మార్చబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి ఎంపీ అవినాష్ రెడ్డినే బరిలోకి దింపనున్నట్టు ఇప్పటికే జగన్ ప్రకటించేశారు. ఇప్పుడు అభ్యర్థిని మార్చబోతున్నారంటూ జోరుగా టాక్ నడుస్తోంది. కడప నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున వైఎస్ షర్మిల బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థిని మార్చాలని జగన్ భావిస్తున్నారట. 

షర్మిల పోటీ చేయడంతో ఓట్లు చీలడమైతే ఖాయం. తద్వారా అవినాష్ రెడ్డి ఓడిపోతే అది తనకే కాకుండా పార్టీకి కూడా నష్టం చేకూరుస్తుందని జగన్ భావిస్తున్నారట. అందుకే అవినాష్ రెడ్డిని మార్చేసి ఆయన స్థానంలో అభిషేక్ రెడ్డిని కడప బరిలో నిలపాలని జగన్ భావిస్తున్నారట. మరికొన్ని స్థానాలను సైతం జగన్ మార్చాలని భావిస్తున్నారట కానీ కడప స్థానాన్ని మార్చాలనుకోవడమే ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. 

అభ్యర్థుల మార్పునకు సంబంధించి అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని టాక్ నడుస్తోంది. మైలవరం వైసీపీ అభ్యర్థిని సైతం మార్చాలని జగన్ భావిస్తున్నారట. మైలవరంలో నర్నాల తిరుపతిరావుకు జగన్ టికెట్ కేటాయించారు. అయితే ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో వసంతను ఎదుర్కొనగలిగే సత్తా తిరుపతిరావుకు లేదని జగన్ భావిస్తున్నారట. కాబట్టి ఆ స్థానం నుంచి జోగి రమేష్‌ను బరిలోకి దింపే అవకాశం ఉందట. మరికొందరు అభ్యర్థులను సైతం జగన్ మారుస్తారని సమాచారం. ఇదంతా టీడీపీ చేస్తున్న ప్రచారం.. ఇందులో నిజానిజాలు ఏంటో తెలియాలి మరి