నాగన్న సర్వే కూడా వైసీపీకే పట్టం!!
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపు ధీమాతోనే ఉన్నాయి. ఎవరి వ్యూహాలు వారు పన్నుతున్నారు. సర్వే సంస్థలు సైతం ప్రి పోల్ సర్వేలతో హోరెత్తిస్తున్నాయి. జాతీయ స్థాయి సర్వే సంస్థలు సైతం ఏపీపై ఫోకస్ పెట్టాయి. ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే అంశంపై సర్వేలు నిర్వహిస్తోంది. నియోజకవర్గాలతో పాుట అక్కడ పోటీ చేసే అభ్యర్థులను సైతం పరిగణలోకి తీసుకుని సర్వే సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. దాదాపుగా అన్ని సర్వే సంస్థలూ ఈసారి కూడా వైసీపీదే విజయమంటున్నాయి. తాజాగా నాగన్న సంస్థ సర్వే నిర్వహించింది. గత నెల మార్చి 17 నుంచి ఈ నెల 7వ తేదీ వరకూ సర్వేను నిర్వహించింది.
అధికార, విపక్ష పార్టీల నడుమ హోరాహోరీ..
మొత్తం 157 స్థానాల్లో ప్రతి నియోజకవర్గం నుంచి 600 మంది చొప్పున మొత్తంగా 105,000 మంది అభిప్రాయాలను నాగన్న సంస్థ సేకరించింది. ఈ సర్వేలో ఈసారి కూడా వైసీపీదే విజయమని తేలింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 103 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఈ సంస్థ వెల్లడించింది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కేవలం 39 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుందట. మిగిలిన 33 స్థానాల్లో అధికార, విపక్ష పార్టీల నడుమ హోరాహోరీ యుద్ధం తప్పదట. అయినా సరే.. వాటిలో కూడా దాదాపు 25 స్థానాల్లో విజయం పక్కాగా వైసీపీదేనట. ఇక లోక్‌సభ ఎన్నికల్లోనూ వైసీపీదే హవా అని నాగన్న సర్వే తేల్చింది.
ఆ మూడు జిల్లాలు క్లీన్ స్వీప్..
20 – 21 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తుందట. కూటమి కేవలం 4 -5 స్థానాలకే పరిమితమవుతుందని నాగన్న సర్వే తేల్చింది. ఇక జిల్లాల వారీగా సైతం నాగన్న సర్వే ఎక్కడ ఏ పార్టీ గెలుస్తుందనే విషయాన్ని స్పష్టం చేసింది. కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందట. ఇక కృష్ణా జిల్లా (హోరాహోరీ 5)లో వైసీపీ, టీడీపీ చెరో 6 స్థానాలను, విశాఖలో మాత్రం టీడీపీ 6 స్థానాలు, వైసీపీ 5 స్థానాలను.. నాలుగు స్థానాల్లో హోరాహోరీ ఉంటుందట. శ్రీకాకుళం- వైసీపీ 7, టీడీపీ 2, (హోరాహోరీ 2), విజయనగరం- వైసీపీ 7, టీడీపీ 1, (హోరాహోరీ 1), తూర్పు గోదావరి- వైసీపీ 6, టీడీపీ 8, (హోరాహోరీ 5), పశ్చిమ గోదావరి- వైసీపీ 6, టీడీపీ 5, (హోరాహోరీ 4), గుంటూరు- వైసీపీ 8, టీడీపీ 4, (హోరాహోరీ 5).. ప్రకాశం- వైసీపీ 8, టీడీపీ 2, (హోరాహోరీ 2), అనంతపురం- వైసీపీ 9, టీడీపీ 3, (హోరాహోరీ 2), చిత్తూరు- వైసీపీ 10, టీడీపీ 2, (హోరాహోరీ 2) సీట్లు గెలుచుకుంటాయి.