ఉద్దానం బాధితులతో మాట్లాడిన లాస్య.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్..

ఉద్దానం బాధితులతో మాట్లాడిన లాస్య.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్..

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చొరవతో తొలిసారిగా ఈ ప్రాంతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అప్పటి వరకూ ఉద్దానం అనే ఒక ఊరు ఉందని కానీ.. ఆ ఊరిలో కిడ్నీ సమస్య ఉందని కానీ ఎవరికీ తెలియదనే చెప్పాలి. ఇక పవన్ తరువాత ఆ ప్రాంతాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంపై చొరవ చూపారు. నాలుగు దశాబ్దాలుగా ఆ ప్రాంత వాసులను పట్టి పీడిస్తున్న కిడ్నీ సమస్య పరిష్కారానికి ఓ మార్గం వేశారు. అయితే దీనిని తాజాగా యాంకర్ లాస్య వెలుగులోకి తీసుకొచ్చింది.

ఉద్దానం ప్రాంతాన్ని ఏళ్ల తరబడి కిడ్నీ సమస్య చాపకింద నీరులా కబళిస్తోంది. ఆ ఏరియాలో ఉన్న జనాభాలో 20 శాతం మందికి పైగా కిడ్నీ వ్యాధి బాధితులే. ఇప్పటి వరకూ కొన్ని వేల మంది ఈ సమస్యతో బాధపడ్డాయి. చికిత్స కోసం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి ఆర్థికంగానూ చాలా కుటుంబాలు చితికిపోయాయి. జగన్ ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపించింది. దీనిని యాంకర్ లాస్య వెలుగులోకి తీసుకొచ్చింది. స్థానికులను ఇంటర్వ్యూ చేయడంతో జగన్ ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం ఎలా చూపించిందనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.

యాంకర్ లాస్యపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. అసలు ఉద్దానం సమస్య పరిష్కారంపై వీడియో చేస్తే తప్పేంటి? అంతలా ట్రోల్ చేయాల్సిన అవసరమేంటి? మంచి చేసినా పాపమేనా? జగన్ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో కిడ్నీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌తో పాటు ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్,  అత్యున్నత ప్రమాణాలతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్‌ను నిర్మించారు. ఈ విషయాలనే లాస్య వెలుగులోకి తీసుకొచ్చింది. జగన్ ప్రభుత్వం చేసిన మంచిని తెలియజేసింది. ఇదేదో నేరమో.. ఘోరమో అయినట్టుగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? లాస్యను ట్రోల్ చేయడంపై ఏపీ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.