జనసేనకు పోతిన మహేష్ రాజీనామా.. నెక్ట్స్ స్టెప్ అదే..

జనసేనకు పోతిన మహేష్ రాజీనామా.. నెక్ట్స్ స్టెప్ అదే..

ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు పార్టీలు మారడం సహజమే. కొందరు పోరాడి సాధిస్తున్నారు. మరికొందరు పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నారు. ప్రస్తుతం జనసేన నుంచి వలసలు జరుగుతున్నాయి. నిజానికి జనసేనకు అందరికీ టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఆ పార్టీ దగ్గరున్న స్థానాలే కొన్ని. వాటిలో ఎంతమందికని పంచుతుంది? ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. నేతలకు నచ్చజెప్పుకోలేక పోతున్నారో లేదంటే నేతలే వినేది లేదనుకున్నారో కానీ టికెట్ దక్కని నేతలు ఆ పార్టీలో ఉండే పరిస్థితి కనిపించడం లేదు.

నేతలు మెల్లగా జనసేనను వీడుతున్నారు. ఇటీవల జనసేన పార్టీ నుంచి తిరుపతి టికెట్ ఆశించిన ప్రముఖ్య వ్యాపారవేత్త గంటా నరహరి టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశతో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇప్పుడు మరో నేత గట్టు దాటేందుకు సన్నాహాలు చేసుకున్నారు. టికెట్ కోసం పోరాడి అలసిపోయిన ఆయన పార్టీకి రాజీనామా చేసేశారు. విజయవాడకు చెందిన కీలక బీసీ నేత పోతిన మహేష్ జనసేనకు రాజీనామా చేశారు. టికెట్ కోసం చాలా ట్రై చేశారు కానీ ఫలితం లేకపోవడంతో పార్టీని వీడారు. 

అయితే టికెట్ ఇవ్వకున్నా కానీ పోతిన మహేష్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు కాబట్టి ఆయనను పవన్ పిలిచి మాట్లాడితే పరిస్థితి మరోలా ఉండేదేమో.. కానీ పవన్ అది కూడా చేయలేదు. దీంతో ఆయన జనసేనకు రాజీనామా చేశారు. నాలుగు రోజులుగా పోతిన మహేష్.. వైసీపీతో టచ్‌లో ఉన్నారంటూ టాక్ నడుస్తోంది. నేడు ఆయన రాజీనామాతో ప్రచారానికి బలం చేకూరినట్టైంది. నెక్ట్స్ ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..

Google News