పీకే బాధేంటి.. డబ్బులిస్తే ఏదైనా మాట్లాడేస్తారా!?

పీకే బాధేంటి.. డబ్బులిస్తే ఏదైనా మాట్లాడేస్తారా!?

పైసా మే పరమాత్మ హై అంటారు.. డబ్బుంటే చాలు ఏమైనా చేసెయ్యొచ్చు.! ముఖ్యంగా రాజకీయాల్లో.. నేతల దగ్గర డబ్బుంటుంది. దానిని తీసుకుని కొందరు చిలక పలుకులు పలుకుతూ ఉంటారు. ఏది చెబితే అది వేదం అనుకుంటారని.. జనాన్ని వెర్రి బాగులవారిగా అంచనా వేసి డబ్బిచ్చిన పార్టీ ఎలా పలికిస్తే అలా పలుకుతూ ఉంటారు. గతంలో ఎన్నికల వ్యూహకర్తగా బీజేపీ, వైసీపీ సహా పలు రాష్ట్రాలలో పలు పార్టీలకు వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అది మానేసి తన సొంత రాష్ట్రమైన బీహార్‌లో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అలా రాజకీయ నాయకుడిగానే ఉండిపోతే ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు. కానీ మధ్యమధ్యలో పాత వాసనలు పోనిచ్చుకోకుండా డబ్బులకు చిలక జోస్యం చెబుతున్నారు. అదేనండీ.. డబ్బిచ్చిన వారు ఏ పలుకు పలకమంటే అది పలికేస్తున్నారు.

ఓపెన్ స్టేట్‌మెంట్స్ ఎలా ఇస్తారు?

సర్వేలు లేవు.. నివేదికలు లేవు.. కానీ ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయాన్ని చెప్పేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అట.. సీఎం వైఎస్ జగన్ గెలుపు కష్టమట. అసలు ఎలాంటి సర్వే వ్యవస్థా లేకుండా.. నెట్‌వర్క్ లేకుండా ప్రజల అభిప్రాయాలు ఎలా తెలుసుకుంటారు? వారి మెదళ్లలోకి దూరి పీకే ఏమైనా సంగ్రహిస్తున్నారా? ఇలాంటి ఓపెన్ స్టేట్‌మెంట్స్ ఎలా ఇస్తారు? ఇది ఆయనకు కొత్తమే కాదు.. గతంలోనూ నోటికొచ్చింది చెప్పి ఫలితాలు రివర్స్ రావడంతో దెబ్బై పోయారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌కు తిరుగు లేదు.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా అని.. అటు కర్ణాటకలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు. ఫలితాల తర్వాత సీన్ రివర్స్. ఇలా చెప్పుకుంటూ పోతే ఛత్తీస్‌గడ్, ఉత్తరాఖండ్‌లలో సైతం ప్రశాంత్ కిషోర్ చెప్పిందేదీ జరగలేదు.

దక్షిణాదిలో భారీగా సీట్లు గెలవడమేంటి?

ఇక ఇప్పుడేమో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ విజయం కష్టమని.. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే తొలిస్థానమని.. ఈసారి దక్షిణాదిలో బీజేపీ భారీగా సీట్లు గెలుస్తుందని నిన్న ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీకి తొలి స్థానంలో నిలిచేంత సీన్ లేదు. ఇధి చిన్న పిల్లాడినడిగినా చెబుతాడు.. అలాంటప్పుడు దక్షిణాదిలో భారీగా సీట్లు గెలవడమేంటి? ఇక తమిళనాడులో ఎంత కష్టపడ్డా దాదాపు 3 కంటే ఎక్కువ గెలవడం కష్టం. పోనీ గతంలో కర్ణాటకలో 25 కొట్టుకుంది కాబట్టి ఈసారి కూడా అలా కొట్టుకొస్తుందా? అంట డజను కంటే ఎక్కువ సీట్లు గెలవడం కష్టమని అంచనా. సౌత్‌లో బీజేపీ జెండా పాతాలంటే కనీసం 30 సీట్లు గెలవాలి. ఇప్పట్లో ఇది అయితే అయ్యే పని కాదు. కాబట్టి పీకే చెప్పావన్నీ బేకారు ముచ్చట్లేనని జనం అంటున్నారు. డబ్బు తీసుకుని ప్రామాణికత.. శాస్త్రీయత లేకుండా మాట్లాడుతున్నారని జనం అంటున్నారు.