చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదు.. ఎన్టీఆర్ మామ నార్నె సంచలనం!

చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదు.. ఎన్టీఆర్ మామ నార్నె సంచలనం!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ఎన్నో.. ఎన్నెన్నో చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురుంచి షాకింగ్ విషయాలు బయట పడుతున్నాయి. ఇప్పటివరకూ వైసీపీ నేతలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాగా.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ మామ, వైసీపీ నేత నార్నె శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు.. ఏ మాత్రం నమ్మదగిన వ్యక్తి కాదంటూ నార్నె చెప్పుకొచ్చారు.

గట్టిగానే…!!

బుధవారం మీడియా సమావేశంలో చంద్రబాబుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన సోదరుడిని గొలుసులు, తాళ్లతో కట్టి బంధించాడని తెలిపారు. చంద్రబాబు సోదరికి యాక్సిడెంట్ అయి విషమ పరిస్థితిలో ఉంటే చూడటానికి రాలేదు సరికదా.. కనీసం ఫోన్ కూడా చేసి పరామర్శించలేదన్నారు. అటువంటి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం మేలు చేస్తాడో తెలుసుకోవాలన్నారు. 

నార్నె ఇంకా ఏమన్నారంటే..

”చంద్రబాబు నాయుడు నమ్మదగిన వ్యక్తి కాదు.. సొంత తమ్ముడినే మోసం చేశాడు. సొంత తమ్ముడికే టికెట్ ఇవ్వలేదు. ఆయన పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. సొంత తమ్ముడిని గొలుసులతో తాళ్లతో కట్టేస్తున్నారు. నేను నెల రోజుల నుంచి అడుగుతున్నా. నీకు దమ్ము, ధైర్యముంటే మీ తమ్ముడిని తీసుకొచ్చి చూపించమని అడుగుతున్నా. దాని గురించి రెస్పాన్స్ లేదు. చంద్రబాబు నాయుడికి కోవర్టులను తయారు చేసి పక్క పార్టీలోకి పంపించి వారితో.. వాళ్ల పార్టీలతో జిమ్మిక్కులు చేయించడం తెలుసు. ప్రజల్లో చంద్రబాబుకు ఎటువంటి మద్దతూ లేదు” అని నార్నె చెప్పారు.

గెలవడు.. రాస్కొండి..!!

‘కేవలం మోసాలు, గారడీల వంటి పనులు చేస్తూనే చంద్రబాబు నాయుడు గట్టెక్కుతున్నాడు. సొంత బలంపై చంద్రబాబుకు గెలిచే కెపాసిటీ లేదు. గెలవలేడు. చంద్రబాబు సొంత చెల్లికి తిరుపతిలో యాక్సిడెంట్ జరిగింది. ఆమె దారుణమైన పరిస్థితుల్లో ఉంటే హైదరాబాద్ ఆసుపత్రిలో జాయిన్ చేసి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నాం. అలాంటి చెల్లిని చంద్రబాబు కానీ.. ఆయన కొడుకు కానీ.. ఆయన భార్య కానీ వచ్చి చూసింది లేదు. ఒక ఫోన్ కూడా చేయలేదు. కనీసం పరామర్శించింది లేదు. సొంత చెల్లినే చూడలేని చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నయాయం చేస్తాడనేది ప్రజలే తెలుసుకోవాలి’’ అని నార్నె శ్రీనివాసరావు అన్నారు.