టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ లావు సంచలనం!

Lavu Sri Krishna On Tdp

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఇటీవల నిర్వహించిన జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలన్నీ వైసీపీకే అనుకూలంగా వస్తున్నాయి. పెయిడ్ సర్వేలంటూ టీడీపీ కూటమి కొట్టి పడేస్తోంది. అయితే సర్వేలు రాంగ్‌గా వచ్చాయి కానీ పార్టీ నేతలు చెప్పే మాటలు కూడా అలాగే ఉన్నాయి. మొన్నటికి మొన్న టీడీపీ ఇంటర్నల్ మీటింగ్‌లో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా టీడీపీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ పార్టీ నేతలకు దిశానిద్దేశం చేశారు. ఈ వీడియో ఎలా లీకయ్యిందో తెలియదు కానీ నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. ఇప్పుడు అదే పార్టీ ఎంపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు సంచలనానికి తెరదీశాయి.

నిజానికి వైసీపీ జెట్ స్పీడ్‌లో దూసుకెళతోంది. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేపట్టిన సిద్ధం యాత్ర ఆ పార్టీకి పెద్ద ఎత్తున మైలేజ్ తెచ్చి పెడుతోంది. ఈ విషయం టీడీపీ నేతలకు సైతం అర్థమవుతోందని వారి మాటలను బట్టి తెలుస్తోంది. మొన్న సురేష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిన్న ఏకంగా ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు మీడియా స్టేట్‌మెంట్ కూడా దీనిని బలపరుస్తోంది. ప్రస్తుతం శ్రీకృష్ణ దేవరాయలు వ్యాఖ్యలు నెట్టింట పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి.

రాష్ట్రంలో టీడీపీ గెలవాలి అంటే చాలా కష్టపడాలని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఎన్డీఏ కూటమిలో కలిసినా కూడా పెద్దగా మేలు అయితే ఏమీ జరగలేదని తెలిపారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ ఇలాంటి మాటలు మాట్లాడడంతో టీడీపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ ఎలా పెరిగిందనేది ఆయన వ్యాఖ్యలతో అర్థమవుతున్నాయి. టీడీపీ అభ్యర్థులకే ఎలాంటి కాన్ఫిడెన్స్ లేదని దీన్ని బట్టి అర్థమవుతోందని అంటున్నారు. మొత్తానికి ఈ వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. వైసీపీ శ్రేణులు ఫుల్ ఖుషీగా ఉన్నాయి.

Google News