ముగిసిన జగన్ బస్సు యాత్ర.. భారీగా మైలేజ్

ముగిసిన జగన్ బస్సు యాత్ర.. భారీగా మైలేజ్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సుయాత్ర బుధవారం ముగిసింది. దాదాపు నెల రోజుల పాటు జగన్ రోడ్డుపైనే ఉన్నందున, అధికార వైఎస్సార్‌సీపీకి అంతో ఇంతో ఉన్న వ్యతిరేకత కూడా పోయి పార్టీ మరింత బలాన్ని కూడగట్టుకున్నట్టుగా అయ్యిందని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలంతా భావిస్తున్నారు.  2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. 

ఆ విధంగానే ఇప్పుడు కూడా మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర నిర్వహించి విపరీతంగా జనాలను ఆకట్టుకున్నారు. జనసేన పార్టీ (జెఎస్‌పి), బీజేపీలతో టీడీపీ పొత్తుపై ఉన్న ప్రచారాన్ని గ్రాబ్ చేయడానికి, పార్టీ అభ్యర్థుల నుంచి ప్రజల దృష్టిని జగన్ వైపునకు మళ్లించడానికి.. నష్టాన్ని ఎదుర్కోవడానికి బస్సు యాత్ర చాలా అవసరమని వైఎస్సార్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఆంధ్రా కాంగ్రెస్ అధినేత్రిగా జగన్ సోదరి వైఎస్ షర్మిల మరో వైపు పోరాడడం వల్ల ఓట్లు చీలిపోయాయి.

ముగిసిన జగన్ బస్సు యాత్ర.. భారీగా మైలేజ్

2009లో తన తండ్రి, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం 2019లో ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేతగా జగన్ ఓదార్పు యాత్ర నిర్వహించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో 3,000 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర అయినా.. జగన్ ఎప్పుడూ యాత్ర మార్గాన్ని అవలంబిస్తున్నారు. ఓదార్పు యాత్రలో కాంగ్రెస్‌తో విభేదాలు రావడంతో జగన్ వైఎస్సార్‌సీపీని స్థాపించి 10 ఏళ్ల తర్వాత అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈసారి కూడా విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రజా సంకల్ప యాత్ర సాగించారు. డ్రోన్ సాయంతో వైసీపీ నిమిష నిమిషానికి విజువల్స్ తీసి ప్రత్యక్ష ప్రసారం చేస్తూ రాష్ట్రం మొత్తానికి సందేశాన్ని చేరేలా చేశారు.