మళ్లీ జనంలోకి జగన్.. నాన్‌స్టాప్ ప్రచారం.. షెడ్యూల్ ఇలా..
ఒకటా రెండా 22 రోజులు 23 జిల్లాలు.. 86 నియోజకవర్గాలు! 2,188 కిలోమీటర్లు యాత్ర.. 09 భారీ రోడ్ షోలు 06 ప్రత్యేక సమావేశాలు, 16 బహిరంగ సభలతో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోనే ఉన్నారు. కూటమి వర్గాలకు ఊహకందని రీతిలో సిద్ధం, మేమంతా సిద్ధం పేరిట మండుటెండైనా.. అర్ధరాత్రి అయినా తన సంకల్పంతో జగన్ బుల్లెట్టులా ముందుకెళ్లారు. ఒక సభకు మించిన జనం.. మరో సభలో రెట్టింపు ఉత్సాహం స్వతంత్రంగానే జనాలు సభల్లో పాల్గొనడంతో ఆ జనసంద్రాన్ని చూసిన కూటమి నేతలు కుప్పకూలిపోయామని ముందుగానే గ్రహించారు. ఇప్పటి వరకూ జగన్ చేసిన పాదయాత్ర, ఓదార్పు యాత్ర ఒక ఎత్తు అయితే.. సిద్ధం, మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర వేరు అన్నట్లుగా పరిస్థితి ఉంది.
మరో జైత్రయాత్ర!
ఎన్నికల ముందు మరో జైత్రయాత్రకు జగన్ సిద్ధం కాబోతున్నారు. ఈ నెల 28న తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచార సభలు నిర్వహించబోతున్నారు. మొదటి నాలుగు రోజుల టూర్ షెడ్యూల్‌ను వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ప్రతిరోజూ మూడు బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. ప్రతి రోజూ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు జరగనున్నాయి. తాజా ప్రకటనతో కూటమి కూసాలు కదిలిపోతున్నాయట. ఇంకెన్ని రోజులు జగన్ జనాల్లో ఉంటాడ్రా బాబూ అని నెత్తి, నోరు బాదుకుంటున్నారట.
ఎప్పుడు.. ఎన్నిరోజులు..?
ఏప్రిల్ 28న ఇలా..
ఉదయం 10:00 గంటలకు తాడిపత్రి
మధ్యాహ్నం 12:30 గంటలకు వెంకటగిరి
మధ్యాహ్నం 03:00 గంటలకు కందుకూరు
ఏప్రిల్ 29న ఇలా..
ఉదయం 10:00 గంటలకు చోడవరం
మధ్యాహ్నం 12:30 గంటలకు పి.గన్నవరం
మధ్యాహ్నం 08:00 గంటలకు పొన్నూరు
ఏప్రిల్ 30న ఇలా..
ఉదయం 10:00 గంటలకు కొండపి
మధ్యాహ్నం 12:30 గంటలకు మైదుకూరు
మధ్యాహ్నం 03:00 గంటలకు పీలేరు
మే 1న ఎక్కడంటే..?
ఉదయం 10:00 గంటలకు బొబ్బిలి
మధ్యాహ్నం 12:30 గంటలకు పాయకరావుపేట
మధ్యాహ్నం 03:00 గంటలకు ఏలూరులో జగన్ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు.