చంద్రబాబుతో ఏకీభవించిన కేసీఆర్.. హాట్ టాపిక్‌గా టీడీపీ, బీఆర్ఎస్ అధినేతలు..

చంద్రబాబుతో ఏకీభవించిన కేసీఆర్.. హాట్ టాపిక్‌గా టీడీపీ, బీఆర్ఎస్ అధినేతలు..

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పుడూ పడింది లేదు. చంద్రబాబు అయితే కేసీఆర్‌ను పెద్దగా ఎప్పుడూ పట్టించుకున్నది అయితే లేదు కానీ కేసీఆర్ మాత్రం సమయం దొరికితే చాలు.. చంద్రబాబును ఏకి పారేస్తారు. గత ఎన్నికల్లో సైతం చంద్రబాబును బూచిగా చూపి ఆయన విజయం సాధించారు.

ఆంధ్ర విషయానికి వస్తే గత నాలుగేళ్లుగా ప్రధాన ప్రత్యర్థి జగన్ అయినా కూడా కేసీఆర్ మాత్రం చంద్రబాబునే తిట్టిపోశారు. అలాంటి చంద్రబాబును తాజాగా కేసీఆర్ కాస్త పాజిటివ్ కోణంలో చూడటమనేది విస్తుగొలుపుతోంది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు చంద్రబాబుపై సడెన్‌కు కేసీఆర్‌కు ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చింది?

చంద్రబాబుకి ప్రస్తుతానికైతే తెలంగాలో టీడీపీని విస్తరించుకోవాలన్న కాంక్ష అయితే ఉంది కానీ అధికారంలోకి ఇప్పటికిప్పుడు వచ్చేయాలన్న తపన లేదు. ఆయన టార్గెట్ కేవలం ఏపీయే. ప్రధాన ప్రత్యర్థి నూటికి నూరు పాళ్లు జగనే. తాజాగా చంద్రబాబు ఏపీలో పాలనను విమర్శించే క్రమంలో తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనవచ్చని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా కేసీఆర్ స్పందించారు. పటాన్ చెరువులో ఎకరా భూమి రూ.30 కోట్లు ఉందని.. దీనిని అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనవచ్చన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్టు కేసీఆర్ చెప్పడం విశేషం.

చాలా కాలం తర్వాత చంద్రబాబును కేసీఆర్ వెనకేసుకు రావడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్, చంద్రబాబు హాట్ టాపిక్‌గా మారారు.

Google News