మరికొన్ని గంటల్లో ఎన్నికలు.. కీలక అస్త్రాన్ని బయటకు తీసిన కేసీఆర్..

మరికొన్ని గంటల్లో ఎన్నికలు.. కీలక అస్త్రాన్ని బయటకు తీసిన కేసీఆర్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని గంటల్లో జరగనున్నాయి. నేటితో ప్రచార పర్వం ముగియనుండగా.. ఈనెల 30న పోలింగ్ జరగనుంది. ఇక పార్టీల భవితవ్యం డిసెంబర్ 3న జరగనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని పార్టీలన్నీ ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే గెలిచే స్కోప్ మాత్రం బీఆర్ఎస్‌కే ఎక్కువగా ఉంది. తాజాగా అంటే ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియనుండగా సీఎం కేసీఆర్ కీలక అస్త్రాన్ని బయటకు తీశారు. ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

హ్యాట్రిక్ సాధించి మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తాను సంతకం పెట్టే తొలి ఫైల్ ఏంటనేది కేసీఆర్ చెప్పారు. ఇంతకీ అదేంటంటారా? బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే.. అసైన్డ్‌ భూములకు పట్టాలిచ్చే ఫైలుపై తొలి సంతకం చేస్తానని అన్నారు. అంతేకాకుండా తొలి కేబినెట్ భేటీలోనే ఆ ఫైలుకు ఆమోద ముద్ర వేస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని తాము చెబుతుంటే.. కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

Advertisement

మొత్తానికి నిన్న రైతుబంధును ఈసీ అలా నిరాకరించిందని విపక్ష పార్టీల నేతలు సంతోషించే లోపే కేసీఆర్ కీలక ప్రకటన చేసి వారికి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి స్తే అసైన్డ్ భూములను గుంజుకుంటుందని విపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్న క్రమంలోనే అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని ప్రకటించి ఆ పార్టీలకు షాక్ ఇచ్చారు. రైతుబంధు ఏమీ ఎన్నికల సందర్భంగా ఇచ్చేది కాదు.. ఎప్పటి నుంచో కేసీఆర్ ప్రభుత్వం ఇస్తోంది కాబట్టి మరికొద్ది రోజులకైనా రైతుబంధు ఇస్తుందన్న నమ్మకం జనాల్లో ఉంది. మొత్తానికి మరోసారి కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.