పచ్చ నేతలకు పచ్చ మీడియా తోడు.. ఎథిక్స్‌కు పాతర..

పచ్చ నేతలకు పచ్చ మీడియా తోడు.. ఎథిక్స్‌కు పాతర..

పచ్చ మీడియా పిచ్చి రాతలు రాస్తూ జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. తెల్లనివన్నీ పాలని.. నల్లనివన్నీ నీళ్లని నమ్మించే యత్నం చేస్తోంది. పచ్చ నేతలకు పచ్చ మీడియా తోడై అరాచకం సృష్టిస్తోంది. చేతిలో మీడియా ఉంది కదాని ఏది పడితే అది రాస్తే నమ్మే రోజులు పోయాయి. అయినా సరే.. ఈనాడు మాత్రం జనాలను నమ్మించే యత్నం పదే పదే చేస్తోంది. ప్రణాళికాబద్దంగా వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లుతూనే ఉంది. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై రాష్ట్రానికి వచ్చే ఐఏఎస్ అధికారులు అత్యధికులు సీఎం జగన్ సామాజిక వర్గానికి చెందిన వారేనని చెప్పించింది. ఆ తరువాత సీన్‌లోకి ఎల్లో మీడియా ఎంటరైంది. అచ్చెన్నాయుడి మాటలను తాటికాయంత అక్షరాలతో వేసి.. అదే నిజమని నమ్మించే ప్రయత్నం ఈనాడు చేసింది. 

జరుగుతున్న డెవలప్ మెంట్ వైపు ఈనాడు కంటికి కనిపించదు. అలాగే టీడీపీ హయాంలో జరిగిన అన్యాయాల గురించి కూడా ఆ పచ్చ మీడియా అస్సలు పట్టించుకోదు. గురువింద మాదిరిగా ఈనాడు వ్యవహరిస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అంతా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన అధికారులే ఉండేవారు మరి అప్పుడెందుకు ఈనాడుకు ఈ విషయం కనిపించలేదు? కేంద్రం నుంచి బాబు హయాంలో ఐఏఎస్ అధికారులు జాస్తి కృష్ణ కిషోర్, సంధ్యారాణి, రాజమౌళి, వెంకయ్య చౌదరి, సాంబశివరావు ఇలా ఎంతో మంది ఏపీ క్యాడర్ కు వచ్చారు. కానీ ఈనాడు తాను చూడాలనుకున్నవి మాత్రమే కనిపిస్తాయా? వద్దు అనుకున్నవి కనిపించవా? అని ఏపీ జనం ప్రశ్నిస్తున్నారు.

Advertisement

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎంతోమంది అనుకూలంగా వ్యవహరించే ఐఏఎస్ అధికారులను రాష్ట్రానికి తీసుకువచ్చారు. వారికి నచ్చిన చోట పోస్టింగ్‌లు ఇచ్చారు. అప్పట్లో అవేమీ కనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం లేనిది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ఏపీలో అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. టీడీపీ ఓటమి భయమే ఎల్లో మీడియా చేత ఇలాంటి అడ్డగోలు రాతలు రాయిస్తోందని, జర్నలిజం ఎథిక్స్ కు తిలోధకాలొదిలి తప్పుడు కథనాలు అచ్చేసే ఈనాడు విశ్వసనీయత ఎప్పుడో గంగపాలైపోయిందని అనుకుంటున్నారు జనాలు.