కేసీఆర్ సరికొత్త నిర్ణయం.. 20 మందిని మార్చేస్తారట..

కేసీఆర్ సరికొత్త నిర్ణయం.. 20 మందిని మార్చేస్తారట..

తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు కాకా రేపుతున్నాయి. ఇప్పటికే నాలుగు స్థానాలు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందున్నారు. దాదాపు సిట్టింగ్‌లందరికీ తొలి జాబితాలో స్థానం దక్కింది. అయితే ఇది ఆయన వ్యూహాత్మక ఎత్తుగడ అని టాక్. ఇప్పటికి ప్రకటించిన వారిలో దాదాపు 20 స్థానాల్లో అభ్యర్థులను కేసీఆర్ మార్చేస్తారని ప్రచారం జరుగుతోంది.

దీనికి రెండు కారణాలున్నాయని తెలుస్తోంది. తొలి జాబితాలో ప్రజా వ్యతిరేకత ఉన్న అభ్యర్థులపై ఇప్పటికే కేసీఆర్ నిఘా పెట్టారని సమాచారం. ప్రజల నుంచి అభ్యర్థులకు వచ్చే స్పందన ఆధారంగా వారికి బీఫామ్ ఇవ్వాలా? వద్దా? అనే విషయమై సీఎం కేసీఆర్ పునరాలోచన చేస్తారని టాక్ నడుస్తోంది.

ఒక కారణం ఏంటంటే.. ఇలా ముందుగా లిస్ట్‌ను రిలీజ్ చేసి అభ్యర్థులను చేజారి పోకుండా చూసుకోవడం ఒక ఎత్తుగడ అయితే.. ఆ తరువాత ప్రజల మద్దతు తక్కువగా ఉన్న వారికి బీఫామ్ ఇవ్వకుండా వారి స్థానంలో ప్రజా మద్దతు ఎక్కువగా ఉన్నవారికి బీఫామ్ ఇస్తారట.

అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేసీఆర్ కొందరు అభ్యర్థులను లిస్ట్ నుంచి తొలగించి కొత్త వారిని యాడ్ చేస్తారట. అయితే తొలగించిన వారికి ఆ తరువాత వేరొక పార్టీలోకి వెళ్లినా కూడా సమయం తక్కువగా ఉన్న కారణంగా వారు పార్టీ మారినా కూడా వారితో ఇబ్బంది ఉండదని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.

మార్పులు, చేర్పులు ఈ స్థానాల్లోనే..

కేటీఆర్‌తో చర్చించిన మీదట.. లిస్ట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయని టాక్. అయితే ఏ ఏ స్థానాల్లో మార్పులు ఉంటాయనే లిస్ట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మల్కాజిగిరిలో మైనంపల్లి హన్మంతరావు, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వర్ రావు, ఇల్లెందులో హరిప్రియా నాయక్, బెల్లంపల్లి నుంచి దుర్గం చిన్నయ్య, మంథని సెగ్మెంట్లో పుట్టా మధు, కల్వకుర్తిలో జైపాల్ యాదవ్, పెద్దపల్లిలో దాసరి మనోహర్రెడ్డి, కోదాడ నుంచి మల్లయ్య యాదవ్, వరంగల్ ఈస్ట్ నన్నపనేని నరేందర్, రామగుండంలో కోరుకంటి చందర్, కంటోన్మెంట్లో లాస్య నందిత స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.

Google News