మూడోసారి కారుదే టాప్ గేర్… కాంగ్రెస్ గట్టిపోటీ.. అయినా ప్రభుత్వం కేసీఆర్ దే..

తెలంగాణ కేసీఆర్‌దే అంటున్న నయా సర్వే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. తెలంగాణ గడ్డ కేసీఆర్‌దేనా? లేదంటే ఈసారి కాంగ్రెస్ పాగా వేస్తుందా? అన్న సంశయాలకు తాజాగా “న్యూస్ టాప్” (NewsTap) అనే సంస్థ ఫుల్ స్టాప్ పెట్టేసింది. తెలంగాణ పక్కాగా కేసీఆర్‌దేనని చెబుతోంది. గతంతో పోలిస్తే కొద్దో గొప్పో సీట్లు తగ్గొచ్చేమో కానీ అధికారం మాత్రం పక్కాగా గులాబీ బాస్‌దేనని తేల్చింది. ఏమాత్రం సందేహం లేకుండా కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారట.

తెలంగాణ కేసీఆర్‌దే అంటున్న నయా సర్వే

తెలంగాణలో బీఆర్ఎస్‌కు 70 సీట్లు వస్తాయని “న్యూస్ టాప్” (NewsTap) వెల్లడించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 30కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని తేల్చింది. బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పదేళ్ల అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళుతోంది.ఇది పార్టీకి బాగా కలిసొస్తోందని సర్వే సంస్థ వెల్లడించింది. కాస్తో కూస్తో వ్యతిరేకత ఉన్నా కూడా బీఆర్ఎస్ 65 నుంచి 76 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని సర్వే తేల్చింది.

తెలంగాణ కేసీఆర్‌దే అంటున్న నయా సర్వే

మలక్‌పేట్, నాంపల్లి, కార్వాన్,చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా ఎంఐఎంకి అడ్డా కాబట్టి ఈ స్థానాలను కాంగ్రెస్ కోల్పోతుందని సర్వే తేల్చింది. బీఎస్పీ కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో దాదాపు 1% ఓటు బ్యాంకును కలిగి ఉంది. అలాగే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు జనాదరణ బాగా ఉంది. దీంతో ఆయన కొంత మేర ప్రభావం చూపించవచ్చట. మంచిర్యాల, నిర్మల్, బాల్కొండ, నారాయణఖేడ్, మల్కాజిగిరి, గద్వాల్, కల్వకుర్తి, షాద్‌నగర్, మునిగోడు, ములుగు, ఖమ్మం స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందట.

Google News