చంద్రబాబు బయటికి రాడనుకున్నారా.. ఎందుకింత సీన్.. ఇప్పుడే అసలు సినిమా..!!

చంద్రబాబు బయటికి రాడనుకున్నారా.. ఎందుకింత సీన్.. ఇప్పుడే అసలు సినిమా..!!

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు విడుదలైన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో బెయిల్ మీద వచ్చిన బాబుకు.. పార్టీ శ్రేణులు, ఎల్లో మీడియా చానెళ్లు, పత్రికలూ చేసిన ఓవర్ యాక్షన్, చూపిన అత్యుత్సాహం ప్రజలను అయోమయానికి గురిచేసింది. ముఖ్యంగా.. ఎల్లోమీడియా పత్రికలూ, ఛానెళ్లలో సైతం ఓవైపు అమాయకుడైన బాబును అరెస్ట్ చేశారు అని రోధిస్తూనే మరోవైపు ఘనంగా బెయిల్ వచ్చింది న్యాయం గెలిచింది.. అంటూ ప్రత్యేక కథనాలు వండి వార్చడం గమనార్హం. జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన ఒక నిందితుడిని కీర్తిస్తూ కథనాలు వండి వార్చారు. కొంపదీసి బోలెడు యుద్ధాలు గెలిచి వస్తున్న బాజీ రావు వస్తున్నాడా..? కళింగ వరకూ విజయయాత్ర చేసుకుని కృష్ణదేవరాయలు తిరిగి వస్తున్నారా ? లేదా ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలిసి స్వదేశం వస్తున్న ఆటగాడా.. ? వరల్డ్ కప్ గెలిచి వస్తున్న మహా క్రీడాకారుడా.. ? దేనికోసం ఎల్లోమీడియా ఆత్రం.. ఏమి చేస్తున్నారో తెలియనంత సోయలేకుండా ఉన్నారా ? అవినీతి కేసులో జైలుకెళ్లి బెయిల్ మీద వస్తుంటే అంత సంబరాలు దేనికి.. ? అంటే ఇన్నాళ్లుగా దిక్కూమొక్కూ లేకుండా పడి ఉన్న పార్టీకి ఒక ముసలి దిక్కు లభించిందన్న ఆనందం తప్ప అయన విడుదలతో ఏమి ఒరిగింది..! అయన అవినీతి చేయలేదని కోర్టు చెప్పలేదు.. దాంతోబాటు ఇది రాజకీయ ప్రేరేపిత కేసు కాదని స్పష్టం చేసింది. ఇప్పటికే సీఐడీ కూడా దాదాపు 140 వరకూ ఆధారాలు సేకరించినట్లు కోర్టులు పేర్కొంది. ఇవన్నీ వదిలేసి దండలూ… దండాలూ.. డ్రామాలూ.. అసలు ఏం చేస్తున్నారో ఒంటి మీద స్పృహ ఉందా.. ? అనే అనుమానాలు సాధారణ పౌరుడిలోనూ వస్తున్నాయ్.

చంద్రబాబు బయటికి రాడనుకున్నారా.. ఎందుకింత సీన్.. ఇప్పుడే అసలు సినిమా..!!

సుప్రీంకోర్టుకు సర్కార్!

మరోవైపు.. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన ఏపీ హైకోర్టు ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్, సీఐడీ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. మంగళవారం నాడు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పలు కీలక విషయాలను పేర్కొన్నారు. హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందని.. ఇది అసాధారణమైన విషయమని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. కేసులో చార్జిషీట్ వేయనంతవరకు దర్యాప్తు కొనసాగుతున్నట్లేనన్నారు. టీడీపీ అకౌంట్‌లో ఊరు, పేరు లేని నగదు జమయ్యిందన్నది వాస్తవమేనని మరోసారి పొన్నవోలు స్పష్టం చేశారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని.. ఈడీ కూడా దర్యాప్తు చేస్తోందన్న విషయాన్ని పిటిషన్‌లో తెలిపారు. సిమెన్స్ అంతర్గత నివేదికలు, ఫోరెన్సిక్ ఆడిట్‌లో అక్రమాలు బయటపడ్డాయన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ హైకోర్టు ఈ కేసులో మినీ ట్రయల్ జరిపిందని.. మినీ ట్రైలర్‌ను నిర్వహించడం చట్ట విరుద్ధమన్నారు. ఇది సామాజిక ఆర్థిక కుంభకోణమని.. 371 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచేశారు అని పొన్నవోలు మీడియాకు వివరించారు.

చంద్రబాబు బయటికి రాడనుకున్నారా.. ఎందుకింత సీన్.. ఇప్పుడే అసలు సినిమా..!!

అవునా.. మరీ ఇంతలా..?

ఇదిలా ఉంటే.. స్కిల్‌ స్కాంకు సంబంధించిన డబ్బు టీడీపీ పార్టీ ఖాతాలోకి చేరినట్టుగా కచ్చితమైన ఆధారం లేనట్టుగా బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కానీ ఇది తొందరపాటుగా భావిస్తున్నామన్న విషయాన్ని సీఐడీ పేర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు.. టీడీపీ నుంచి ఎవరూ ఇప్పటివరకూ దర్యాప్తునకు హాజరు కాలేదని.. సీఐడీ అడిగిన సమాచారం కూడా ఇప్పటివరకూ ఇవ్వలేదు. అందుకే.. దర్యాప్తునకు సహకరించడంలేదని కోర్టుకు స్పష్టంగా తెలియజేశామని.. అలాంటపుడు ఆ డబ్బు టీడీపీ ఖాతాకు చేరలేదని ముందే హైకోర్టు ఎలా తేల్చేయడం ఏంటని సీఐడీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. మరోవైపు.. ఈ కేసులో చంద్రబాబును ఏ రకంగా బాధ్యుడ్ని చేస్తారంటూ బెయిల్‌ ఉత్తర్వుల్లో పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ స్కాంలో కుట్రకోణం అత్యంత కీలకమైనదని.. నేరం జరగడానికి దారితీసిన పర్యవసానాల్లో ఏ స్థాయిలో ఎవరు పాలుపంచుకున్నా చట్టాన్ని దాన్ని తీవ్రంగానే చూస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అలాంటపుడు కోర్టు దర్యాప్తు పూర్తి కాకుండానే చంద్రబాబుకు సంబంధం లేనట్లు వ్యాఖ్యానించడం నిబంధనలకు విరుద్ధం అని జగన్ సర్కార్, సీఐడీ అభిప్రాయపడుతూ కేసును సుప్రీం కోర్టులో పిటిషన్‌లో దాఖలు చేసింది. 

ఈ మొత్తమ్మీద ఎపిసోడ్‌లో బాబు బయటికి వచ్చే పరిస్థితి లేదని టీడీపీ భావించిందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. బయటికి రానే వచ్చారు కానీ.. రెగ్యులర్ బెయిల్ వచ్చింది అయితే.. సుప్రీంలో సవాల్ చేయడంతో మళ్లీ తెలుగు తమ్ముళ్లలో ఒకింత భయం మొదలైంది. అయితే.. ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంలో కూడా తమకే అనుకూలంగా తీర్పు వస్తుందని టీడీపీ శ్రేణులు.. కచ్చితంగా సుప్రీంలో షాక్ తగులుతుందని సీఐడీ, వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ పిటిషన్ విచారణకు ఎప్పుడు వస్తుందో.. ఏం తేలుతుందో చూడాలి మరి.